Tollywood: ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ, ఆన్ లైన్ టికెటింగ్ చేస్తూ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టంలో సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతూ ఉంది. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది.
Also Read: ఓటీటీ విప్లవానికి నాంది.. సినిమా వాళ్లకు ఉపాధి !
ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని.. కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషన్లు పేర్కోన్నారు. దీంతో చిత్ర పరిశ్రమకు చెందిన వారంతా సంతోషించారు. అయితే ఇప్పుడు వారికి షాక్ ను ఇచ్చే విధంగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. సినిమా టికెట్ ధరల జీవో రద్దుపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో ప్రభుత్వం చేసిన అప్పీల్ లో ప్రభుత్వం తరుపు వాదనలు వినాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ మేరకు లంచ్ మోషన్ ధాఖలు చేయగా, కాసేపట్లో హైకోర్టు వాదనలు విననుంది. మరి ఈ వివాదంపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Also Read: యాంకర్లుగా చేసి హీరోయిన్లుగా మారిన వారు ఎందరో తెలుసా..?