Gutha Sukender Reddy: శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన మంత్రి కావాలనే ఆశతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరినా ఆయన మంత్రి పదవి కలగానే మిగిలిపోతోంది. గతంలోనే మంత్రి పదవి వస్తుందని ఆశించిన మండలి చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఈ సారి కూడా అదే సీటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో కేసీఆర్ ఆయనను మండలి చైర్మన్ గా నియమించేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ను నియమించనున్నట్లు సమాచారం.
సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి కావడంతో మరోమారు ఆయన పదవిని రెన్యవల్ చేశారు. దీంతో మళ్లీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చిరకాల వాంఛ మంత్రి పదవి మరోమారు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన సందర్భంలో శాసనమండలిపై కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుఖేందర్ రెడ్డిని చైర్మన్ గా చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ను నియమించనున్నట్లు కూడా తెలుస్తోంది.
Also Read: TRS: టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత మొదలైందా?
అయితే బండ ప్రకాష్ కు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని భావించినా చివరిక్షణంలో కేసీఆర్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈటల బండ ప్రకాష్ సామాజిక వర్గం ఒకటే కావడంతో ఈటల స్థానాన్ని ప్రకాష్ తో భర్తీ చేస్తారని అందరు భావించినా ఆ దిశగా కేసీఆర్ ఆలోచించడం లేదు. దీంతో మొత్తం మీద కేసీఆర్ మదిలో ఏం ఉందో ఎవరికి అర్థం కావడం లేదు.
Also Read: Mallanna Army: ‘మల్లన్న’ సైన్యంపై గురిపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్?