బ్రేకింగ్ : మాజీ ప్రధాని మన్మోహన్ కు కరోనా

కరోనాకు కాదెవరు అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారింది. దేశ రాజధాని ఢిల్లీ కరోనాకు ఆవాసంగా మారుతోంది. అక్కడ కేసులు ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఏకంగా 25 వేల కేసులు వెలుగుచూడడంతో దెబ్బకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. ఇప్పుడు ఢిల్లీలో సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులంతా కరోనా బారినపడుతున్నారు. ఆఖరు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం కరోనా బారినపడడం విశేషం, ఆయన మార్చి 4న కరోనా […]

Written By: NARESH, Updated On : April 19, 2021 6:54 pm
Follow us on

కరోనాకు కాదెవరు అనర్హం అన్నట్టుగా పరిస్థితి మారింది. దేశ రాజధాని ఢిల్లీ కరోనాకు ఆవాసంగా మారుతోంది. అక్కడ కేసులు ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఏకంగా 25 వేల కేసులు వెలుగుచూడడంతో దెబ్బకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు.

ఇప్పుడు ఢిల్లీలో సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులంతా కరోనా బారినపడుతున్నారు. ఆఖరు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం కరోనా బారినపడడం విశేషం, ఆయన మార్చి 4న కరోనా టీకా తీసుకున్నా కూడా ప్రస్తుతం కోవిడ్ బారినపడ్డారు. దీంతో ప్రాణాలకు ముప్పు ఏం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

కాంగ్రెస్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఢిల్లీలో కరోనా తీవ్రంగా ఉంది. నేటి రాత్రి 10 గంటల నుంచి మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.. లాక్ డౌన్ పై కేజ్రీవాల్ ఈరోజు లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తో సమావేశమయ్యారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలను వివరించారు.