బాబాయి పవన్ కళ్యాణ్ అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టం అని మెగాస్టారే చాలా సందర్భాల్లో చెప్పారు. అది నిజమే అని చరణ్ మరోసారి రుజువు చేశాడు. తన బాబాయి పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ అని తేలగానే చరణ్ వెంటనే శంకరపల్లిలోని పవన్ దగ్గరకు వెళ్ళాడు. శంకరపల్లిలో ఉన్న తన ఫార్మ్ హౌస్ లోనే పవర్ స్టార్ క్వారెంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మెరుగుపడుతోంది. అన్నట్టు బాబాయి ఆరోగ్యాన్ని దగ్గరుండి చరణ్ చూసుకుంటున్నాడట.
అపోలో సంస్థలోని అనుభవజ్ఞులైన వైద్యులను పవన్ కోసం ఏర్పాటు చేశాడట చరణ్. అలాగే వారి ద్వారా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ హెల్త్ అప్ డేట్ ను ప్రతి ఫోర్ అవర్స్ కి ఒకసారి అడిగి తెలుసుకుంటున్నాడట. చరణ్ కి పవన్ అంటే ఎంత ఇష్టమో ఈ సంఘటనతో తేలిపోయింది. ఇక రామ్ చరణ్ తన ‘ఆచార్య’ షూటింగ్ ను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండడం, తన తండ్రి చిరంజీవి వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా సోకడంతో చరణ్ తన కుటుంబంలో ఇంకెవ్వరికీ కరోనా సోకకుండా అప్రమత్తం అయ్యాడు.