https://oktelugu.com/

బిగ్ బ్రేకింగ్: సీఎం కేసీఆర్ కు కరోనా

తెలంగాణ సీఎం కేసీఆర్  కరోనా బారినపడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించారని.. ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని […]

Written By: , Updated On : April 19, 2021 / 08:09 PM IST
Follow us on

KCR

తెలంగాణ సీఎం కేసీఆర్  కరోనా బారినపడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించారని.. ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లో ఉన్నారని చెప్పారు.

ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు.

వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్ కు విశ్రాంతి అవసరమని.. అందుకే ఫాంహౌస్ కు వెళ్లారని తెలిపారు.

ఇక మంత్రి కేటీఆర్ సైతం ప్రకటన చేశారు. స్వల్ప లక్షణాలతో కేసీఆర్ బాధపడుతున్నారని.. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. వైద్యులు నిరంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని తెలిపారు.