https://oktelugu.com/

Break To Gadapa Gadapa: ‘గడపగడప’కూ విమర్శలు… వదిలేస్తున్న మంత్రులు

Break To Gadapa Gadapa: ప్రజల నుంచి ఎదురవుతున్న నిలదీతలు, నిరసనలు ఏపీ సీఎం జగన్ ను వణుకు పుట్టిస్తున్నాయా? ఆయన పునరాలోచనలో పడ్డారా? గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలనుకున్నరా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పథకాలే గట్టెక్కిస్తాయన్న సీఎం ఆశలు అడియాశలయ్యాయి. అందుకే ఆయన బడుగు బలహీనవర్గాల నినాదాన్ని పఠిస్తున్నారు. సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించడానికి తలపెట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఘోరంగా విఫలమైంది. మెజారిటీ ఎమ్మెల్యేలే […]

Written By:
  • Dharma
  • , Updated On : May 19, 2022 / 09:27 AM IST
    Follow us on

    Break To Gadapa Gadapa: ప్రజల నుంచి ఎదురవుతున్న నిలదీతలు, నిరసనలు ఏపీ సీఎం జగన్ ను వణుకు పుట్టిస్తున్నాయా? ఆయన పునరాలోచనలో పడ్డారా? గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలనుకున్నరా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పథకాలే గట్టెక్కిస్తాయన్న సీఎం ఆశలు అడియాశలయ్యాయి. అందుకే ఆయన బడుగు బలహీనవర్గాల నినాదాన్ని పఠిస్తున్నారు. సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించడానికి తలపెట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఘోరంగా విఫలమైంది.

    ROJA

    మెజారిటీ ఎమ్మెల్యేలే ఈ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నారు. దూరంగా ఉంటున్నారు. దీంతో… ‘సామాజిక న్యాయ యాత్ర’ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులను బస్సుల్లో జనంలోకి పంపాలని జగన్ తీర్మానించుకున్నారు. బలహీన వర్గాలకు పదవుల్లో పెద్దపీట వేశామని చెప్పుకోవడంతోపాటు… పథకాల ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నాలుగు బస్సుల్లో మంత్రులు ఈ యాత్ర చేస్తారు. ‘గడప గడపకు’ కార్యక్రమంలో ప్రజలు కురిపిస్తున్న ప్రశ్నలవర్షానికి ప్రజాప్రతినిధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. ఏం సమాధానం చెప్పాలో తెలియక.. త్వరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చి బయటపడుతున్నారు. మళ్లీ జనంలోకి వెళ్లడానికి విముఖత చూపుతున్నారు. ఫలితంగా పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలన్న జగన్‌ ఆలోచన ఆదిలోనే దెబ్బతింది. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు నేరుగా వెళ్లడం కంటే మంత్రులను బస్సుల్లో పంపితే మంచిదని ప్రభుత్వ పెద్దలు యోచించినట్లు తెలిసింది. బస్సులపై నుంచే మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించిన పథకాల గురించి వివరించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్లు సమాచారం.

    Also Read: BJP Focus On Telangana: తెలంగాణపై బీజేపీ దండయాత్ర.. అగ్రనేతల రాకకు కారణమేంటి?

    ఆ నాలుగు నియోజకవర్గాల్లోనే..
    రాష్ట్ర కేబినెట్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మం త్రులు పాల్గొంటారు. దీనికి ‘సామాజిక న్యా యం’ అని నామకరణం చేశారు. దీని రూట్‌మ్యా్‌పపై బుధవారమిక్కడ తాడేపల్లిలో ప్రభు త్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి ధర్మా న ప్రసాదరావు సమీక్ష జరిపారు. శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపట్టి.. బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 26న శ్రీకాకుళం లేదంటే విజయనగరం లో.. 27వ తేదీన రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో ఇవి జరుగుతాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసు కనుకే గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు వాయిదా వేస్తూ వచ్చారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈ ఏడాది మార్చి 15వ తేదీన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో.. ఉగాది నుంచి సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలని మంతుల్రు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.

    కానీ వారు పది రోజులు వాయిదా వేయాలని కోరారు. అందుకు ప్రభుత్వ పెద్దలు సరేనన్నారు. అయినా నెల వరకు అధికార పక్ష నేతలు ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఈ నెల 10వ తేదీన కార్యక్రమం మొదలైంది. కానీ ప్రభుత్వ పెద్దలు అనుకున్నదొకటి.. జరుగుతున్నది మరొకటి. ఊళ్లకు వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులపై జనం విరుచుకుపడుతున్నారు. పథకాలు, పెన్షన్‌ అందడం లేదని.. రోడ్లు, విద్యుత్‌ కోతలపై నిలదీస్తున్నారు. ఇవి పాలకపక్షానికి మింగడుపడడం లేదు. రెండేళ్లలో ఎన్నికలు.. ఇంకోవైపు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు.. ఈ సమయంలో ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు కొనసాగితే ప్రమాదమని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందారు. ప్రత్యామ్నాయంగా బస్సు యాత్రను తెరపైకి తెచ్చారు. దానిని కూడా ఎంపిక చేసుకున్న నాలుగు నియోజకవర్గాలకే పరిమితం చేయడం పాలకపక్షంలో ఏర్పడిన భయానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

    Gadapa Gadapa ycp

    విపక్షానికి అస్త్రం..
    పార్టీ పరంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తూండాగనే… దానికి బ్రేక్ వేస్తూ మరో కార్యక్రమం నిర్వహించాలనుకోవడంపై వైసీపీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. గడప గడపకూ వెళ్తే్ నిరసనలు వ్యక్తమవుతున్నాయన్న ఉద్దేశంతో ఇప్పుడు యాత్ర పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతాయని భావిస్తున్నారు. నిజానికి బీసీ మంత్రులతో యాత్ర చేయించాలని గతంలోనే నిర్ణయించారు. అయితే గడప గడపకూ వెళ్లాలని కార్యక్రమం పెట్టి మంత్రులకు ప్రత్యేక బాధ్యతలిచ్చిన తర్వాత దానికి బ్రేక్ చేసేలా కొత్త కార్యక్రమం రూపొందించడమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. పైగా ఈ రూట్ మ్యాప్ షెడ్యూల్ కూడా విచిత్రంగానే ఉంది. సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు, మూడు రోజులు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న తర్వాత వ్యక్తిగత పర్యటనలో వారంవరకూ ఉంటారు. ఈ వారంలోనే మంత్రులెవరూ సీఎం అందుబాటులో లేరన్న కారణంగా ఇతర చాన్సులు తీసుకోకుండా అందర్నీ బిజీగా ఉంచే వ్యూహాన్ని ఈ యాత్ర ద్వారా అమలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

    Also Read:Prakash Raj: ప్రకాశ్ రాజ్ భవితవ్యం ఏమిటి?
    Recommended Videos


    Tags