Block Spam Calls : లోన్ ఆఫర్లు, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ లేదా నకిలీ స్కీమ్‌ల పేరుతో వచ్చే స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ కాల్స్ చిరాకు కలిగించడమే కాకుండా, కొన్నిసార్లు మోసాలకు కూడా దారి తీస్తాయి. అయితే ఇకపై మీరు ఈ స్పామ్ కాల్స్‌ను శాశ్వతంగా బ్లాక్ చేయవచ్చు. ఎయిర్‌టెల్, జియో, వీఐ తమ వినియోగదారుల కోసం డీఎన్‌డీ (డూ నాట్ డిస్టర్బ్) సర్వీసును అందిస్తున్నాయి. దీని ద్వారా ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేసుకోవచ్చు.
డీఎన్‌డీ అంటే ఏమిటి?
డీఎన్‌డీ అనేది ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రారంభించిన ఓ గవర్నమెంట్ ఫెసిలిటీ. మొబైల్ వినియోగదారులకు అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల నుండి ఉపశమనం కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశం. అన్ని నెట్‌వర్క్‌ల కోసం డీఎన్‌డీని యాక్టివేట్ చేయడానికి మీ మొబైల్ నుండి 1909కి SMS పంపాలి. ఈ తర్వాత వచ్చే సూచనలను తప్పకుండా ఫాలో కావాలి.
ఎయిర్‌టెల్ యూజర్ల కోసం
ఎయిర్‌టెల్ యూజర్లకు ముందుగా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మోర్ లేదా సర్వీసెస్ విభాగంలోకి వెళ్లాలి. ఇప్పుడు డీఎన్‌డీ (డూ నాట్ డిస్టర్బ్) ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రయారిటీ ప్రకారం కేటగిరీలను బ్లాక్ చేయవచ్చు.
జియో యూజర్ల కోసం
జియో యూజర్లు తమ ఫోన్‌లో ముందుగా మైజియో యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు సర్వీస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డూ నాట్ డిస్టర్బ్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ప్రయారిటీ ప్రకారం డీఎన్‌డీని యాక్టివేట్ చేసుకోవచ్చు.
వీఐ యూజర్ల కోసం
మీ ఫోన్‌లో వీఐ యాప్‌ను ఓపెన్ చేయండి. లేకపోతే, మీరు దానిని ఆపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మెనూపైకి వెళ్లి ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావలసిన డీఎన్‌డీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీరు స్పామ్ కాల్స్, SMSలను బ్లాక్ చేయవచ్చు.
ట్రూకాలర్ సహాయం కూడా తీసుకోవచ్చు
స్పామ్ కాల్స్‌ను గుర్తించి స్వయంగా బ్లాక్ చేసే ట్రూకాలర్ వంటి యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఆటో బ్లాక్ స్పామ్ కాల్స్ ఫీచర్‌ను ఆన్ చేసుకోవచ్చు.
Also Read : స్పామ్ కాల్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇలా ఫుల్ స్టాప్ పెట్టేయండి