Retro Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొత్త దర్శకులు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాలను చేస్తూ వాళ్ళను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులు డిఫరెంట్ కథాంశాలను ఎంచుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ మేకింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజు లాంటి దర్శకుడు తన ఇంటెలిజెన్స్ ని వాడుతూ చాలా అద్భుతమైన రేటింగ్ తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో చేసిన రెట్రో (Retro) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: హిట్ 3′ ఫుల్ మూవీ రివ్యూ…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే గ్యాంగ్ స్టర్ గా ఉన్న సూర్య అవన్ని వదిలేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అనుకోని సంఘటనల వల్ల మళ్లీ తను గ్యాంగ్ స్టర్ గా మారాల్సి వస్తుంది. మొత్తానికైతే ఈ చంపడం, చావడం అనేది తనను వదిలి వెళ్లిపోవడం లేదనే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఎవరైతే తన మీదకి వస్తున్నారో వాళ్లని ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు.మరి ఈ క్రమంలో సూర్య తన శత్రువులను చంపాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో కార్తీక్ సుబ్బరాజు రైటింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉంది. లీనియర్ స్క్రీన్ ప్లే ని వాడకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ని వాడుతూ పార్లల్ గా యాక్షన్ ఎపిసోడ్స్ ను ఎలివేట్ చేస్తూ సూర్య క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ ని చూపిస్తూ సినిమాని సక్సెస్ తీరానికి చేర్చే ప్రయత్నం చేశాడు. ఇక తనకిచ్చిన క్యారెక్టర్ లో సూర్య ఆ లిమిటేషన్స్ ఏమి దాటకుండా చాలా అద్భుతంగా నటించాడు. దర్శకుడు ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా రొటీన్ సినిమాల కంటే భిన్నంగా ఉంది.
డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే నేరేషన్ అక్కడక్కడ స్లోగా సాగుతుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా అయితే కనిపించవు. మొత్తానికైతే యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇంతకుముందు చేసిన జిగర్తాండ, పేట, మహాన్ లాంటి సినిమాలు అతనికి చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
మరి ఈ సినిమా కూడా అలాంటి కోవకే చెందుతోంది. ముఖ్యంగా ఆయన రైటింగ్ లోని స్కిల్స్ అయితే ఈ సినిమాలో చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. ఇక దర్శకుడిగా చాలా సందర్భాల్లో తనను తాను ప్రూవ్ చేసుకున్న కార్తీక్ సుబ్బరాజు రైటర్ గా కూడా మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశాడు… సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కార్తిక్ సుబ్బరాజు యొక్క రైటింగ్ స్టైల్ ని ప్రేక్షకుడికి చాలా కొత్తగా పరిచయం చేస్తుంది.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సూర్య తన నటనతో ఈ మూవీని వీలైనంతవరకు సక్సెస్ తీరాలకు చేర్చే ప్రయత్నం చేశాడు. తన క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించడమే కాకుండా ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా లిమిటేషన్స్ ను ఫాలో అవుతూ ఆ పాత్రకి ఎంతైతే కావాలో అంతవరకే నటించి మెప్పించాడు. సూర్య ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లన్నింటిలో ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్ గా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… పూజా హెగ్డే పర్ఫామెన్స్ కూడా ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. ఇప్పటివరకు ఆమె పర్ఫామెన్స్ బేస్డ్ సినిమాలైతే ఎప్పుడు చేయలేదు. కానీ ఈ సినిమాలో ఆమె పాత్రకి పర్ఫాము చేసే స్కోప్ అయితే ఉంది. అందువల్ల నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఒక సెటిల్డ్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చింది…
ఇక ప్రకాష్ రాజ్ కూడా చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. క్యారెక్టర్ లోని వేరియేషన్స్ ని చాలా బాగా చూపిస్తూ నటించాడు. అలాగే మలయాళం నటుడు ‘జోజ్ జార్జ్’ విలన్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయి నటించాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర మరొక ఎత్తు అయింది… నాజర్ సైతం ఈ సినిమాకి బెస్ట్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఆయన డిఫరెంట్ నటించి ఆ పాత్రకి ప్రాణం పోశాడు… ఇక మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమాకి టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా ఈ మూవీ మీద హైప్ ను తీసుకురావడంలో కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అలాగే సంతోష్ నారాయణ ది బెస్ట్ బ్యా గ్రౌండ్ మ్యూజిక్ అందించిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తోంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా ఇన్నోవేటివ్ థాట్స్ తో షాట్స్ ను డిజైన్ చేశారు. ఈ మూవీ చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క షాట్ తీయడానికి ఆయన సినిమాటోగ్రాఫర్ ఎంతలా కష్టపడ్డాడో ఆయన కష్టం మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది…
ప్లస్ పాయింట్స్
కథ
సూర్య యాక్టింగ్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది…
కొన్ని అనవసరపు సీన్స్…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5