Homeజాతీయ వార్తలుBlack Panther in Nilgiri: నలుపు రంగు పాంథర్, రెండు చిరుతలు.. చూడ్డానికి రెండు కళ్ళూ...

Black Panther in Nilgiri: నలుపు రంగు పాంథర్, రెండు చిరుతలు.. చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు! వైరల్ వీడియో

Black Panther in Nilgiri: అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా వృక్షాల హననానికి పాల్పడుతున్నప్పటికీ.. మనదేశంలో ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలో అడవులు ఉన్నాయి. ఆ అడవులలో దండకారణ్యాలు కూడా ఉన్నాయి. ఆ దండకారణ్యాలలో నీలగిరి అడువులు ప్రముఖమైనవి. ఇక్కడ జీవవైవిధ్యం బాగుంటుంది. సంవత్సరం పొడవునా నీటి సౌకర్యం ఉంటుంది. చెట్లు కూడా విస్తారంగా ఉంటాయి కాబట్టి జంతువుల మనుగడకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఉండే పచ్చిక మైదానాలు శాకాహార జంతువులకు ఆవాసాలుగా ఉంటాయి. అందువల్ల మాంసాహార జంతువులకు తిండికి డోకా ఉండదు. మన దేశంలో పులుల అభయారణ్యాలుగా ఉన్న వాటిల్లో నీలగిరి ప్రత్యేకమైనది..

Also Read:  ‘కచ్చతీవు’.. ఈ శ్రీలంక దీవిపై మోడీ-స్టాలిన్ కన్ను ఎందుకు?

నీలగిరిలో గతంలో పులులు కనిపించేవి. అయితే ఇటీవల కాలంలో అటవీ శాఖ అధికారులు పులుల సంఖ్యను తెలుసుకోవడానికి అక్కడక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలలో అడవులలో ఉన్న పులుల కదలికలు నమోదు అవుతున్నాయి. అయితే ఇటీవల ఒక వీడియోలో మాత్రం అరుదైన దృశ్యం కనిపించింది. దృశ్యం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఆ దృశ్యం ప్రకారం అందులో ఒక నల్ల చిరుత.. దానిని అనుసరిస్తూ మిగతా చిరుతలు ఉన్నాయి. నల్ల చిరుతను పాంథర్ అని పిలుస్తున్నారు. అది చూడ్డానికి బలంగా.. తీక్షణమైన చూపుతో కనిపిస్తోంది. దాని వెనుక ఉన్న మరో పులి, పిల్లలు ఉన్నాయి. అవన్నీ కూడా నీలగిరి సమీపంలో ఉన్న రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నాయి బహుశా అది ఒక గ్రామం అయి ఉండవచ్చు రాత్రిపూట.. ఊరు మొత్తం పడుకున్న తర్వాత ఆ పులులు బయటకు వచ్చాయి.

Also Read:  కశ్మీర్‌ శాస్త్రవేత్తల విజయం.. ఇక మటన్ గురించి చింతలేదు

నీలగిరి కొండల్లో భారతీయ వాతావరణానికి అనుకూలంగా పెరిగే పులులు ఉంటాయి. గతంలో ఈ ప్రాంతంలో పులుల సంఖ్య తగ్గినప్పటికీ.. కొంతకాలంగా పెరుగుతోంది. వేటకు అనుకూలమైన పరిస్థితులు ఉండడం.. అడవి విస్తారంగా ఉండడం.. నీటి వనరులు కూడా బాగుండడం.. సంవత్సరం మొత్తం ఈ అడవిలో పచ్చదనం ఉండడం వల్ల పులుల సంఖ్య కొంతకాలంగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో నల్ల పులి కూడా చేరడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది..” పులులు ఈ అడవిలో ఉండడం సర్వసాధారణమైన విషయం. భారతీయ వాతావరణానికి తట్టుకునే పులులు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇప్పుడు నల్లటి పులి కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి ఈ వాతావరణంలో ఆ పులి జీవిస్తోంది అంటే గొప్ప విషయమే. ఇక్కడ జీవ వైవిధ్యం బాగుందని చెప్పడానికి ఇది బలమైన నిదర్శనం. ఈ సంతతిని కాపాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ దిశగా మేం ప్రయత్నాలు చేస్తున్నామని” అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నలుపు రంగు పులి ఇక్కడి వాతావరణాన్ని తట్టుకొని ఉండడం గొప్ప విషయమని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఆ పులి సంతతిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తామని వ్యాఖ్యనిస్తున్నారు. అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులు త్వరలో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular