Kiara Advani sister: పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం మంచి ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కియారా అద్వానీ(Kiara Advani) పేరు కచ్చితంగా ఉంటుంది. యూత్ ఆమెని చూస్తే మెంటలెక్కిపోతారు. ఏమి అందం రా బాబు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. MS ధోని బయోపిక్ తో వెండితెర అరంగేట్రం చేసిన కియారా అద్వానీ, మన తెలుగు ఆడియన్స్ కి ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా బాగా దగ్గరైంది. ఆ తర్వాత తెలుగు లో రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’, ‘ గేమ్ చేంజర్’ వంటి చిత్రాలు చేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. తెలుగు లో ఈమెకు సక్సెస్ లు పెద్దగా రాలేదు కానీ, హిందీ లో టాప్ 3 హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. ప్రస్తుతం ఈమెకు దీపికా పదుకొనే కి ఇచ్చినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు,కియారా అద్వానీ రేంజ్ ఏమిటి అనేది. 2023 వ సంవత్సరం లో ఈమె ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) ని ప్రేమించి పెళ్లాడింది.
Also Read: నా భర్త ఆ విషయంలో ఎన్నో ఏళ్ళ నుండి టార్చర్ చేస్తున్నాడు : జెనీలియా
వీళ్లిద్దరి పెళ్లి అప్పట్లో అందరికీ షాకింగ్ సర్ప్రైజ్ అనుకోవచ్చు. వీళ్లిద్దరికీ రీసెంట్ గానే ఒక పాప పుట్టింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కియారా అద్వానీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇదంతా పక్కన పెడితే కియారా అద్వానీ కి ఇషితా అద్వానీ(Ishita Advani) అనే అందమైన అక్క ఉంది. ఈమె కియారా అద్వానీ కంటే అందగత్తె, సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే పెద్ద హీరోయిన్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈమె సినీ రంగం లోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. వృత్తిపరంగా న్యాయవాదిగా కొనసాగుతుంది. ఈమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే, ఈమె 1989 వ సంవత్సరం లో ముంబై లో జన్మించింది. ప్రభుత్వ లా కాలేజీ లోనే ఆమె పట్టా పొందింది. ఆమె తండ్రి పేరు జగదేవ్ అద్వానీ, ఈయన ముంబై లో ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త. అదే విధంగా తల్లి పేరు జెనీవీవ్ అద్వానీ, ఈమె ఒక ఉపాధ్యాయురాలు. ఇషితా కి కియారా అద్వానీ మాత్రమే కాకుండా, ఇషాన్ అద్వానీ,మిషల్ అద్వానీ అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.