Kashmiri Scientists: భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం. పంటలతోపాటు కోళ్లు, మేకలు, చేపల పెంపకం ద్వారా అనుబంధ రంగాల్లోనూ రైతులు విజయం సాధిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కోళ్లు, మేకల పెంపకం దేశంలో మాంసం అవసరాలు తీర్చడంలేదు. దీంతో కోళ్లను ఫారాల్లో పెంచుతున్నారు. దీంతో చికెన్ ఉత్పత్తి పెరిగింది. అందుకే చికెన్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉంటున్నాయి. అయితే మటన్ ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. దీంతో దిగుమతి చేసుకోవల్సిన పరిస్థితి. గొర్రెలు, మేకలు పెంచుతున్నా.. మాసం ఉత్పత్తి పెరగకపోవడానికి కారణం మయోస్టాటిన్ అనే జీన్. ఇది గొర్రెలు, మేకల్లో మజిల్ ఎదుగుదలను నిరోధిస్తుంది. అందుకే మన మేకలు, గొర్రెలు బక్కగా, పొట్టిగా ఉంటాయి. దీనిని గుర్తించిన కశ్మీర్ శాస్త్రవేత్తలు మొదటి జీన్ ఎడిటెడ్ గొర్రెను ఆవిష్కరించారు.
తొలి జీన్ ఎడిటెడ్ గొర్రె..
కశ్మీర్‌లోని షేర్–ఎ–కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇఖఐ్కఖఇ్చట9 సాంకేతికతను ఉపయోగించి గొర్రెల్లో మయోస్టాటిన్ జీన్‌ను సైలెంట్ చేశారు. భారతదేశంలో తొలి జీన్–ఎడిటెడ్ గొర్రెను అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ మటన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచి, దేశంలోని ఆహార భద్రత సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మయోస్టాటిన్ జీన్‌ను లక్ష్యంగా..
మయోస్టాటిన్ జీన్ కండరాల పెరుగుదలను నియంత్రిస్తుంది. దీనిని సైలెంట్ చేయడం ద్వారా గొర్రెల కండర ద్రవ్యరాశి 30% వరకు పెరిగింది. ఫలితంగా మాంసం ఉత్పత్తి వేగవంతమవుతుంది. ఈ గొర్రెలు సాధారణ బరువుతో పుడతాయి కానీ మూడు నెలల్లో ఎక్కువ బరువు సాధిస్తాయి, అయితే ఉన్ని ఉత్పత్తి సాధారణ స్థాయిలోనే ఉంటుంది. ఈ సాంకేతికత మటన్ ధరల పెరుగుదలను నియంత్రించడంతోపాటు, రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. విదేశీ డీఎన్‌ఏ లేని ఈ గొర్రెలు వ్యాధి నిరోధకతను మెరుగుపరచడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉండటం వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.
Also Read: మోడీ నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చబోతోందా?
జన్యు శాస్త్రంలో కొత్త శకం..
జమ్మూ కశ్మీర్‌లోనికశ్మీర్‌లోని షేర్–ఎ–కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 2012లో పశ్మినా మేక నూరిని క్లోన్ చేసిన విజయాన్ని సాధించింది. ఈ జీన్–ఎడిటెడ్ గొర్రె భారతదేశంలో జంతు బయోటెక్నాలజీలో మరో మైలురాయిగా నిలుస్తుంది, గొర్రెల పెంపకంలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగల సామర్థ్యాన్ని చూపిస్తుంది.