BJP : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీలు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వివరణ కోరడం జరుగుతాయి. తప్పు చేసినట్లు నిరూపణ అయితే పార్టీ నుంచి బహిష్కరిస్తాయి. దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సొంత పార్టీ ఎంపీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ఏం జరిగింది..
కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ జయంత్ సిన్హా తీరుపై బీజేపీ అధిష్టానం అసహనం వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ఎన్నికల్లో ఓటుహక్కు కూడా వినియోగించుకుకోలేదు. దీంతో బీజేపీ అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. ఈమేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
హజారీబాద్ సిట్టింగ్ ఎంపీ..
ఇదిలా ఉంటే జయంత్ సిన్హా హజారీబాద్ లోక్‌సభ ఎంపీ. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మనీశ్ జైస్వాల్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి సిన్హా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. కనీసం ఓటుహక్కు కూడా వినియోగించుకోలేదు. దీంతో ఆగ్రహించిన అధిష్టానం చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో వివరాణ ఇవ్వాలని కోరింది.
స్వయంగా తప్పుకుని..
జార్ఖండ్‌లోని హజారీబాగ్ సిట్టింగ్ ఎంపీ అయిన జయంత్ సిన్హా సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పర్యావరణ మార్పుల అంశంపై దృష్టి కేంద్రీకరించేందుకు సమయం వెచ్చిస్తానని, అందుకోసం ప్రత్యక్ష ఎన్నికల బాధ్యతల నుంచి తనను తప్పించాలని మార్చిలో పార్టీ అధ్యక్షుడు జేపీ.నడ్డాను కోరారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హజారీబాగ్ టికెట్‌ను పార్టీ మజనీశ్ జైస్వాల్‌కు కేటాయించింది.
సంస్థాగత వ్యవహారాలకూ దూరం..
టికెట్ ఖరారు చేసిన నాటి నుంచి జయంత్ సిన్హా పార్టీ సంస్థాకగత వ్యవహారాలకూ దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. ఐదో విడతలో భాగంగా సోమవారం(మే 20న) ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఇందులో జయంత్ ఓటు కూడా వేయలేదు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడే ఈ జయంత్ సిన్హా. యశ్వత్‌సిన్హా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. సొంత పార్టీ ఎంపీకే బీజేపీ ఇలా షోకాజ్ నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది.