https://oktelugu.com/

Tollywood: ఎన్నో సినిమాల్లో నటించిన ఈ నటుడు ఒకప్పుడు జాయింట్ కలెక్టర్.. గుర్తుపట్టారా?

లక్షల జీతం వదిలి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించారు ఓ నటుడు. ఈయనను చాలా సినిమాల్లోనే చూసి ఉంటారు...

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 21, 2024 / 02:20 PM IST

    Vadlamani Srinivas served as a joint collector before entering the film industry

    Follow us on

    Tollywood: సినిమా ప్రపంచంలో చాలా మంది తమ కెరీర్ ను రిస్క్ లో పెడుతుంటారు. కొందరు ఖాళీగా ఉండి వస్తే కొందరు పెద్ద పెద్ద ఉద్యోగాలను కూడా వదిలేసి వస్తారు. లక్షల జీతాలను కూడా వదిలేసి సినిమా నేపథ్యం లేకుండా కష్టపడి పైకి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మనం అలాంటి ఒక నటుడి గురించి తెలుసుకుందాం.

    లక్షల జీతం వదిలి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించారు ఓ నటుడు. ఈయనను చాలా సినిమాల్లోనే చూసి ఉంటారు. రీసెంట్ గా రిలీజ్ అందుకుంటూ హిట్ అవుతున్న చాలా సినిమాల్లో ఈ నటుడు కనిపిస్తారు కూడా. మరి ఆయన ఎవరు అనుకుంటున్నారా? వడ్లమాని శ్రీనివాస్. ఈయన పూర్తి పేరు వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్. ఇక ఈయన సినిమాల్లోకి రాకముందు వైజాగ్ జాయింట్ కలెక్టర్ గా పని చేశారట. చిన్నప్పటి నుంచి ఈయనకు సినిమాలు, సాహిత్యం అంటే మక్కువ.

    సినిమాలు, సాహిత్యం మీద ఆసక్తి ఉన్నా కూడా బాగా చదివి జాయింట్ కలెక్టర్ అయ్యారు. కానీ ఆయన నటుడిగా మారాలి అనుకోలేదట. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ వడ్లమాని శ్రీనివాస్ కు ఫ్యామిలీ ఫ్రెండ్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో వడ్లమాని శ్రీనివాస్ నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మారుతి దర్శకత్వం వహించిన మహానుభావుడు సినిమాలో కూడా నటించి మెప్పించారు.

    Vadlamani Srinivas

    అప్పటికి కూడా వడ్లమాని శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ గానే పని చేశారట. ఉద్యోగం చేస్తూనే, గీత గోవిందం, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, డియర్ కామ్రేడ్ సినిమాల్లో మెప్పించారు. వి, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో వడ్లమాని శ్రీనివాస్ పోషించిన పాత్రలకి మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు రావడంతో ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఇంత తక్కువ కాలంలోనే దాదాపు 70 సినిమాలకు పైగా సినిమాల్లో నటించారు. మొదటిగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకి పదివేల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఆ తర్వాత శైలజ రెడ్డి అల్లుడు సినిమాకి రోజుకి 30 వేల పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.