UP Elections: దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్..అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. కమలనాథులు ఇందుకు పక్కా వ్యూహాలు రచించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని కమలనాథులు అంటున్నారు. 350కిపైగా సీట్లు పక్కాగా వస్తాయని ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను మళ్లీ గెలిపిస్తాయని, తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని సీఎం యోగి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలపైన యోగి ఫైర్ అయ్యారు. ప్రియాంక ఎలక్షన్ టూరిజం, అఖిలేశ్ వ్యూహాలు ఏవీ కూడా యూపీలో పని చేయవని విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
తాము గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర’లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, ఈ నేపథ్యంలో యూపీ ప్రజలు తమ వెంటే ఉంటారని యోగి అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 350కిపైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటున్నదని జోస్యం చెప్పారు. దేశంలో అభివృద్ధికి కేరాఫ్‌గా యూపీ ఉందని, రాష్ట్రంలోని 24 కోట్ల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని మోడీ సర్కారు సహకారంతో పాటు పడిందని తెలిపారు.
Also Read: ‘జగనాలూ’.. కాచుకో ఇక.. ‘ప్రత్యేక హోదా’ రగిలిస్తున్న చంద్రబాబు!
తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 36 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, తద్వారా 21 మిలియన్ల మంది రైతులకు మేలు జరిగిందని గుర్తు చేశారు సీఎం యోగి. భారతదేశ అభివృద్ధిలో యూపీదే కీలక పాత్రని తెలిపారు. భారత్ గ్లోబల్ ఎకానమీగా మారడంలో ఉత్తరప్రదేశ్ కీ రోల్ ప్లే చేస్తోందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. యూపీలో మళ్లీ కమలనాథులే గెలవబోతున్నట్లు సమాచారం. అయితే, కొన్ని స్థానాల్లో ఎస్పీ పోటీ ఇవ్వబోతున్నదని, కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని తెలుస్తోంది.
Also Read: గోవా కాంగ్రెస్ లో అసమ్మతి.. పార్టీ పరిస్థితి అధోగతి