BJP Pic Of The Day: ఒక మరుపురాని కలయిక.. దేశంలోని పవర్ ఫుల్ వ్యక్తులంతో సామాన్యంగా ఒక గార్డెన్ లో కుర్చీలు వేసుకొని అనుభూతులు పంచుకున్న అరుదైన సందర్భం. అందుకే ఇది పిక్ ఆఫ్ ది డేగా మారింది. దేశంలో ఇప్పుడు బీజేపీ ఇంత ప్రబల శక్తిగా ఎదిగిందంటే కారణం నరేంద్రమోడీనే. ఆయన గుజరాత్ సీఎంగా చేసిన పాలనదక్షతే ప్రధాని పదవికి అర్హుడిని చేసింది. బీజేపీలో అందలం దక్కేలా చేసింది. ఒక ఛాయ్ వాలాగా సామాన్యుడిలా వచ్చిన మోడీ ఇప్పుడు దేశాన్ని ఏలే బలమైన నేతగా ఎదిగారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు.
ఒకానొక సమయంలో 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీతో పోరాడలేక బీజేపీ చతికిలపడింది. ఒకే ఒక్క ఎంపీ సీటుకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షంగా కూడా లేకుండా పోయింది. కానీ నాడు అటల్ బిహారీ వాజ్ పేయి 90వ దశకంలో బీజేపీకి ప్రాణం పోశారు. పొత్తులతో పార్టీని నిలబెట్టారు. నాడు టీడీపీ, అన్నాడీఎంకే సహా ఇతర ప్రాంతీయపార్టీలతో కేంద్రంలో బీజేపీ సర్కార్ ఐదేళ్లు సాగింది.
బీజేపీని దేశంలో నిలబెట్టి నమ్మకం కలిగింగిచిన ఘనత ఖచ్చితంగా వాజ్ పేయి, అద్వానీలదే. వీరిద్దరి ద్వయం బీజేపీని నిలబెట్టింది.ఇప్పుడు వారి వారసుడు నరేంద్రమోడీ పార్టీని దేశంలో తిరుగులేని శక్తిగా మలిచాడు.
నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక సీనియర్లకు గౌరవం ఇచ్చాడు. చాలామందిని కేంద్రమంత్రులను చేశారు. వెంకయ్య నాయుడు లాంటి వారిని ఉపరాష్ట్రపతిని చేశారు. ఇక అద్వానీ, జోషి లాంటి పెద్దలను పార్టీకి పెద్దదిక్కుగా భావించి గౌరవించారు.
తాజాగా బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. బీజేపీ పెద్లలను ఆహ్వానించారు. పెద్దాయన అద్వానీ బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రిరాజ్ నాథ్ సింగ్ లు ఒక్కచోట చేరారు. అద్వానీ ఇంట్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో టీ తాగుతూ ముచ్చటించారు. దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తులంతా ఒక్కచోట ఇలా సాధారణంగా కూర్చొని అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఈ చిత్రం పిక్ ఆఫ్ ది డేగా నిలిచిందని చెప్పొచ్చు.