Homeఎంటర్టైన్మెంట్Tollywood: నవంబర్12 న బాక్స్ ఆఫీస్ పై వార్ కి ఎన్ని సినిమాలు సిద్దమయ్యాయో తెలుసా...

Tollywood: నవంబర్12 న బాక్స్ ఆఫీస్ పై వార్ కి ఎన్ని సినిమాలు సిద్దమయ్యాయో తెలుసా…

Tollywood: కరోనా తర్వాత థియేటర్ లో సినిమా హవా పెరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే అప్పటివరకు సినిమా ప్రియులకు సినిమా సందడి లేదని చెప్పాలి అయితే ఈ ఏడాది సినిమా ప్రియులకు అలరిస్తున్నారు మన హీరోలు ఒకరి తర్వాత ఒకరు దూసుకుంటూ తమ సినిమాలను విడుదల చేస్తున్నారు దీనికి తోడు ఓటీటీ కి  కూడా క్రేజ్ పెరిగి మార్కెట్ ను పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ వారంలో థియేటర్‌ లో విడుదల కానున్న సినిమాలను అలా ఒక లుక్కేద్దాం…

tollywood movies and web series list which are releasing on november 12th

ఆర్ ఎక్స్ 100 సినిమాతో సక్సెస్ ను అందుకున్న హీరో కార్తికేయ ప్రస్తుతం సరిపల్లి తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘రాజా విక్రమార్క’ లో నటిస్తున్నారు. ఆదిరెడ్డి, రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అలానే సినిమాలో తాన్య రవిచంద్రన్‌ కథానాయిక గా నటిస్తుండగా… సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సుధాకర్‌ కోమాకుల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్‌ 12న థియేటర్‌లలో విడుదల కానుంది.

Raja Vikramarka - Official Trailer | Kartikeya, Tanya Ravichandran | Sri Saripalli | 88 Rama Reddy

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా దామోదర తెరకెక్కించిన చిత్రం ‘పుష్పక విమానం’. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శాన్వి మేఘన కథానాయికగా చేస్తుంది. ఈ సినిమా కూడా  నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pushpaka Vimanam Theatrical Trailer | Anand Deverakonda,Geeth Saini,Saanve Megghana | Damodara

హీరో శ్రీకాంత్‌ ఉద్యమ నాయకుడి గా ‘తెలంగాణ దేవుడు’. హరీశ్‌ వడత్యా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మొహహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మిస్తున్నారు. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడు. బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, వెంకట్‌, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌గా రూపుదిద్దుకుంటుంది.

అలానే వీటితో పాటు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కిన “కురుప్‌” ఈ చిత్రం కుడా నవంబర్‌ 12న థియేటర్‌లో విడుదల కానుంది. మరో వైపు అదే రోజు కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘కె3’. దీన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం కూడా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఆమని, గౌతమ్‌ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో ‘ది ట్రిప్‌’ అనే చిత్రం కూడా  నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఓటిటీ వేదికగా పాయల్‌ రాజ్‌పుత్‌, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో ‘3 రోజెస్‌’ అనే వెబ్ సిరీస్ రూపొందింది. ప్రముఖ ఓటిటీ తెలుగు ఓటిటీ సంస్థ “ఆహా” లో నవంబర్‌ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వారంలో సినిమా ప్రియుల కోసం ఇన్ని చిత్రాలు సందడి చేసేందుకు రెడీ గా ఉన్నాయ్. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరించి విజయం సాధిస్తుందో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version