ఏపీని టార్గెట్ చేసిన బీజేపీ.. జగన్ కు చెక్ యేనా?

రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరం ఊహించలేం. అందులోనూ ఏపీ రాజకీయాలు చాలా డిఫరెంట్‌. ఎప్పుడు ఎవరు మిత్రులవుతారో తెలియదు.. ఎవరు శత్రువులు అవుతారో తెలియదు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ పెద్దలు  వ్యవహరిస్తున్న తీరు కూడా అలానే ఉంది. వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతున్నార‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. గ‌తంలో త‌మిళ‌నాడులో అనుస‌రించిన వ్యూహాన్ని  ఏపీలోనూ అమ‌లు చేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ వ్యూహం ఇక్కడ పారేలా ప్లాన్‌ చేస్తున్నట్లు ఢిల్లీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. […]

Written By: NARESH, Updated On : November 1, 2020 12:46 pm
Follow us on


రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరం ఊహించలేం. అందులోనూ ఏపీ రాజకీయాలు చాలా డిఫరెంట్‌. ఎప్పుడు ఎవరు మిత్రులవుతారో తెలియదు.. ఎవరు శత్రువులు అవుతారో తెలియదు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ పెద్దలు  వ్యవహరిస్తున్న తీరు కూడా అలానే ఉంది. వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతున్నార‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. గ‌తంలో త‌మిళ‌నాడులో అనుస‌రించిన వ్యూహాన్ని  ఏపీలోనూ అమ‌లు చేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ వ్యూహం ఇక్కడ పారేలా ప్లాన్‌ చేస్తున్నట్లు ఢిల్లీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

సీఎం జగన్ మీద ఇప్పటికే అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అయితే.. గతంలో తమిళనాడు సీఎం జయలలితపై ఉన్న అవినీతి కేసుల్లో ప్రధాని మోడీ ఒక్కసారి వేగం పెంచారు. ఆమెపై ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న కేసులు విచార‌ణ‌కు రావ‌డం.. కేసులు కూడా ఖ‌రారు కావ‌డం తెలిసిందే. అయితే.. జ‌య‌ల‌లిత అప్పటికే మ‌ర‌ణించారు కూడా. ఆ త‌ర్వాత ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌ను జైలుకు పంపించి.. త‌మ‌కు అనుకూలంగా ఉంటార‌నే ప‌ళ‌ని స్వామిని సీఎం పీఠంలో కూర్చోబెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. త‌మిళ‌నాడు స‌ర్కారు నోరు మెద‌ప‌డం లేదు. విచిత్రం ఏంటంటే జ‌య‌ల‌లిత మ‌ర‌ణాంత‌రం బీజేపీ అన్నాడీఎంకేతో బ‌ల‌వంత‌పు పొత్తు కూడా పెట్టేసుకుంది.

Also Read: ప్రభుత్వం ఫెయిల్యూర్సే టీడీపీ అస్త్రాలా?

ఈ పొత్తు అన్నాడీఎంకేకు ఇష్టం లేక‌పోయినా క‌ష్టంగా అయినా పెట్టుకోక త‌ప్పలేదు. మ‌రోవైపు చాప‌కింద నీరులా త‌మిళ‌నాడులో విస్తరించాల‌ని ప్రయ‌త్నాలు చేస్తోంది. ఇక‌.. ఏపీ విష‌యంలోనూ ఇప్పుడున్న రాజ‌కీయాల‌ను మార్చాల‌ని బీజేపీ వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో జగన్‌ ప్రభుత్వం నడుస్తోంది. జగన్‌ తన మీద ఉన్న కేసులతో కేంద్రంతో గొడవలకు కూడా పోవడం లేదు. బీజేపీ పెద్దలతో స‌ర్దుకు పోతూనే ఉన్నారు.

Also Read: విశాఖ రాజధాని: అక్కడ ప్రభుత్వ భూమిని కొల్లగొట్టింది ఎవరు?

అయితే.. ఇప్పుడు బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందుకు ఏపీని టార్గెట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో కూడా అన్నాడీఎంకేను మించి ఎదగాలని బీజేపీ ప్లాన్‌. స్వయంగా స‌ర్కారును ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌ను అత్యంత వేగంగా విచార‌ణ పూర్తి చేసి.. ఆయ‌న‌ను జైలుకు పంపించాల‌ని చూస్తోంద‌ట‌. ఈ క్రమంలోనే ఇదే పార్టీకి చెందిన ఒక అస‌మ్మతి నేత‌ను, త‌మ‌కు అనుకూలంగా ఇప్పటికే మార్చుకున్న నాయ‌కుడిని ఏపీలో కీల‌క స్థానంలో పెట్టి.. తాము చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్నట్టు ఢిల్లీలో ప్రచారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మరి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏపీలో ఏమేరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి.