https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ రచ్చ.. రాజమౌళిపై బండి సంజయ్ ఫైర్

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరక్కెక్కిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఆర్ఆర్ఆర్ నుంచి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్ సోషల్ మీడియాలో సన్సేషన్ క్రియేట్ చేశాయి. చరణ్ పుట్టిన రోజున ‘బీమ్ ఫర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 12:25 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరక్కెక్కిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఆర్ఆర్ఆర్ నుంచి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్ సోషల్ మీడియాలో సన్సేషన్ క్రియేట్ చేశాయి. చరణ్ పుట్టిన రోజున ‘బీమ్ ఫర్ రామరాజు’ రిలీజై యూట్యూబ్లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇటీవల కొమురంభీమ్ పుట్టిన రోజు సందర్భంగా ‘రామరాజు ఫర్ బీమ్’ టీజర్ రిలీజైంది.

    Also Read: పవర్ స్టార్ పవన్ ప్యాకేజీ.. తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

    ఎన్టీఆర్ టీజర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగులోకి దూసుకెళ్లి కొత్త రికార్డులను సృష్టించింది. ఈ టీజర్ చివర్లో కొమురంభీం పాత్రకు ఓ మతానికి చెందిన టోపి పెట్టడాన్ని పలువురు తప్పుపట్టారు. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం రాజమౌళికి వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాశంగా మారింది.

    Also Read: గాంధీ, నెహ్రూలను కూడ వదలని కంగనా

    కొమురంభీంను కించపరిచేలా సినిమా తీస్తున్నారని.. ఈ మూవీని రిలీజ్ చేస్తే బరిశెలతో తరిమికొడుతామంటూ బండి సంజయ్ హెచ్చరించారు. ఆర్ఆర్ఆర్ లో హిందూమతాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కాగా ఇప్పటికే పలు ఆదివాసీ సంఘాలు, బీజేపీ ఎంపీ సోయం బాపురావులు ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేస్తే అడ్డుకుంటామంటూ హెచ్చరించారు.