https://oktelugu.com/

ప్రైవేట్ పాఠశాలలకు జగన్ సర్కార్ షాక్.. టీసీ లేకుండానే…?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ విద్యాసంస్థలు వేధించకుండా తీపికబురు అందించింది. జగన్ సర్కార్ ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటివరకు చదివిన విద్యార్థులు తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పిస్తోంది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలలను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 1, 2020 / 12:33 PM IST
    Follow us on


    ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ విద్యాసంస్థలు వేధించకుండా తీపికబురు అందించింది. జగన్ సర్కార్ ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటివరకు చదివిన విద్యార్థులు తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పిస్తోంది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూరనుంది.

    రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మఒడి లాంటి పథకాల ద్వారా జగన్ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ప్రభుత్వం విద్యాదీవెన కిట్ల ద్వారా యూనిఫాం, బూట్లు, స్కూల్ బ్యాగ్స్ ను అందజేస్తోంది.

    కరోనా వైరస్ విజృంభణ వల్ల సామాన్య, పేద తరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను చదివించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు టీసీ కావాలని కోరితే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో జగన్ సర్కార్ టీసీకి బదులుగా తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉన్నా చాలాంటూ శుభవార్త చెప్పింది.

    జగన్ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ కు షాక్ ఇచ్చే విధంగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.