BJP Social Media Controversy: సామాజిక మధ్యమాల ప్రభావం అంశం మరోసారి పార్లమెంట్ ను కుదిపేసింది. మరోమారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వేదికగా సోషల్ మీడియాపై అక్కసు వెళ్లగక్కింది. బీజేపీ ఫేస్ బుక్, ట్విటర్లను వాడుకుని ఎన్నికల్లో లబ్ధిపొందిందని ఆరోపణలు చేసింది. ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వాపోయింది. దీంతో సభలో దుమారం రేగింది బీజేపీ తీరుపై ప్రతిపక్షాలు గోల చేశాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బీజేపీ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా సోషల్ మీడియాను వాడుకుని అధికారం చేజిక్కించుకున్నారని దుయ్యబట్టారు
ఈ ఆరోపణలు ఇప్పటివి కావు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ చెబుతూనే ఉంది. బీజేపీ సోషల్ మీడియాను వాడుకుని ప్రతిపక్షాలను తొక్కి పడేస్తుందని రాహుల్ గాంధీ సైతం గతంలోనే గగ్గోలు పెట్టారు. దీనిపై ఫేస్ బుక్ కూడా సరైన రీతిలోనే స్పందించింది. ఒక్క బీజేపీకే కాదు కాంగ్రెస్ కు కూడా తాము ప్రచారం చేశామని చెబుతున్నా అందులో వాస్తవం లేదని ఆ పార్టీ బుకాయిస్తోంది. ఏదిఏమైనా సోషల్ మీడియాను బీజేపీ వాడుకున్నంత ఎవరు వాడుకోవడం లేదనేది ప్రధాన ఆరోపణ. దీనిపై బీజేపీ నేతలు కూడా సమాధానాలు ఇచ్చారు.
Also Read: CM Jagan: ఒంటరిపోరు మళ్లీ కలిసి వస్తుందా?
ఈ నేపథ్యంలో ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాలు బీజేపీకి చెందిన నేతల వార్తలను ప్రసారం చేస్తూ వారికి మద్దతు తెలపడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రిలయన్స్ సంస్థ తీసుకొచ్చిన డిజిటల్ విధానాన్ని కూడా బీజేపీ బాగా వాడుకుంటోందని చెబుతున్నారు. దీనికి తోడు అసత్య ప్రచారాలు ప్రసారం చేస్తూ వారిని అధికారం వైపు తీసుకెళ్తున్నారనే వాపోతున్నారు మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం పార్లమెంట్ పై కూడా పడటంతో సభ్యులు ఆందోళన చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా సరోగేట్ అడ్వర్టైజింగ్ కోసం ఫేస్ బుక్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో సోనియాగాధీ ఫేస్ బుక్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీజేపీకి అనుకూలంగా ప్రసారాలు చేస్తూ పరోక్షంగా సాయం చేయడంపై ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఫేస్ బుక్ వ్యవహారం పార్లమెంట్ లో రగడ రాజేసిందనే చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా బీజేపీ కోసం ప్రచారం చేయడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
డిజిటల్ మీడియాను కూడా తనకు అనుకూలంగా మలుచుకుని బీజేపీ ప్రత్యర్తి పార్టీలను ఎదగనీయకుండా చేస్తోందని ఆరోపించింది. రిలయన్స్ కు చెందిన న్యూస్ జే బీజేపీకి అనుకూల వార్తలను ప్రసారం చేసి బీజేపీ గెలుపుకు సాయపడిందని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తన బాధను వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ప్రభావంపై తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ విధానాలను తూర్పారబట్టింది. ఇదంతా కావాలనే చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్నారని వాపోయింది.
Also Read: Chinajiyar Swamy : కేసీఆర్ తో చెడింది.. చినజీయర్ స్వామిపై వివాదాల బండ పడింది.. వీడియోతో బుక్!