spot_img
Homeజాతీయ వార్తలుWine Shops Closed In Hyderabad: మందు బాబులకు షాక్.. రెండు రోజులు వైన్స్ బంద్

Wine Shops Closed In Hyderabad: మందు బాబులకు షాక్.. రెండు రోజులు వైన్స్ బంద్

Wine Shops Closed In Hyderabad: హోళీ వేడుకలకు నిబంధనలు విధించారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో మందు నిషేధం విధించడంతో బార్లు, క్లబ్బులు మూతపడుతున్నాయి. పోలీసులు నిషేధాలు విధించడంతో రెండు రోజుల పాటు మందు అందుబాటులో లేకపోవడంతో మద్యం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. ముందుగానే మద్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. వేడుకల నేపథ్యంలో మందు లేకపోతే ఎలా అనే ఉద్దేశంతో ముందస్తుగానే మద్యం కొనుగోలు చేసేందుకు క్యూలో నిలబడి మద్యం తీసుకున్నారు.

Wine Shops Closed In Hyderabad
Wine Shops Closed In Hyderabad

గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు పోలీసులు విధించిన ఆంక్షలతో నగరంలో అపరిచిత వ్యక్తులు రంగులు పోయడాన్ని నిషేధించారు. వాహనాలు, భవనాలపై కూడా రంగులు పోయవద్దని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో నగరంలో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు.

Also Read: Liquor Policy AP: మద్యంపై ఏపీ సర్కారు ‘థియరీ’ సామాన్యులకు అర్థమయ్యేనా?

మద్యం దుకాణాల బంద్ నేపథ్యంలో నిన్న రాత్రి మద్యం షాపుల వద్ద ప్రజలు క్యూలో నిలబడి కొనుగోలు చేశారు. ఆంక్షల సందర్భంలో రెండు రోజులకు సరిపడ మద్యం కొనుగోలు చేశారు. దీంతో ఇంట్లోనే వేడుకలు చేసుకుని బయట ఎవరికి కూడా ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతో విధించిన నిషేధాలతో ప్రజలు ఇబ్బందులు పడొద్దని సూచిస్తున్నారు. అందుకే రెండు రోజుల పాటు నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

Wine Shops Closed In Hyderabad
Wine Shops Closed In Hyderabad

గతంలో కూడా బోనాల పండుగ సందర్భంగా కూడా పోలీసులు ఇలాగే నిషేధాలు విధించారు. దీంతో నగరంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే నిషేధం విధించినట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగి రోడ్ల మీద విచ్చలవిడిగా గొడవలు చేస్తే వచ్చే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసుల నిషేధంతో నగరంలో మందుబాబులకు కాస్త ఇబ్బందే అని చర్చ జరుగుతోంది.

Also Read: Rapid Rail: దేశంలోనే మొదటి ర్యాపిడ్ రైల్ పిక్స్ వైరల్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version