Sedition Case Against KCR: వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు కూడా వినాశకాలం దాపురించిందని బీజేపీ నేతలు అంటున్నారు. కావాలనే బీజేపీని టార్గెట్ చేసుకుని బురదజల్లే పని మొదలుపెట్టారు. కానీ దీంతో ఆయనకే మచ్చ వస్తుందని ఊహించలేకపోతున్నారు. ఆకాశం మీద ఉమ్మెస్తే అది మన మీదే పడుతుందని తెలియడం లేదు. కేంద్రంలోని బీజేపీని లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ రాష్ట్రంలో కార్యక్రమాలుచేయడం ఆయన తెలివి తక్కువ తనానికి నిదర్శనమే. ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కామెంట్లు చేయడం, ప్రధాని, ఆర్థిక మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించడం వంటి వాటిపై బీజేపీ గుర్రుగా ఉంది.
దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఎమ్మెల్సీ రామచంద్రరావు కేసీఆర్ పై దేశద్రోహం కేసు వేస్తామని ప్రకటించారు. దీంతో ప్రస్తుతం కేసీఆర్ నాలుకను అదుపులో పెట్టుకోవాల్సి ఉన్నా బీజేపీపై అవాకులు చెవాకులుపేలుతున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉన్నా తామేదో ఘనత సాధించినట్లు వాపును చూసుకుని బలుపుగా భ్రమిస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ మాట్లాడిన మాటలపై న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత కేసీఆర్ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలో కేసీఆర్ ఓర్వలేకపోతున్నారు. బీజేపీని రాష్ట్రంలో ఎదగనీయకుండా చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ విధంగా ఆరోపణలు చేస్తూ తన పతనాన్ని తానే కోరుకుంటున్నారు. చెరపకురా చెడేవు అనే సామెత గుర్తుకు రాలేదేమో కేసీఆర్ కు.
Also Read: Bandi Sanjay Vs KCR: కేసీఆర్ మీద కోర్టుకు వెళ్తున్న సంజయ్.. టీఆర్ ఎస్‌కు అస్త్రం రెడీగా ఉందిగా..!
ఇప్పటికే టీఆర్ఎస్ పై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. బీజేపీపై సానుకూలత కూడా ఎక్కువవుతోంది. అందుకే కేసీఆర్ బీజేపీని రాష్ట్రంలో బలపడనీయకుండాచేయాలనే ఉద్దేశంతోనే ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తమ మనుగడకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా బీజేపీ ఉపేక్షించదనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. కేసీఆర్ బీజేపీపై దురుద్దేశంతోనే ఆరోపణలకు దిగుతున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎదుగుతున్న బీజేపీపై అభాండాలు వేస్తే ఊరుకోబోమని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా అందరిపై టీఆర్ఎస్ నేతలు ఆరోపణలకు దిగడం తెలిసిందే. దీంతో నోరు అదుపులో పెట్టుకోవాలని ఎన్ని సార్లు సూచించినా కేసీఆర్ లో మార్పు రావడం లేదు. దీంతోనే ఆయనపై దేశద్రోహం కేసు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: KCR: కేసీఆర్ కు ఇక చుక్కలు చూపించడమే మిగిలిందా?