Karate Kalyani: కరాటే కళ్యాణి బాగా బోల్డ్. ‘బాబీ పిండేశావ్’ అనే సింగిల్ డైలాగ్ తో బాగా పాపులర్ అయింది ఈ నటి. అయితే తాజాగా “నాకు మంచి అబ్బాయి దొరికితే.. పెళ్లికి లేదా సహజీవనానికి కూడా రెడీ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దాదాపు 250 సినిమాల్లో కరాటే కళ్యాణి నటించినా ఎక్కువగా వ్యాంప్ పాత్రలకే పరిమితం అయింది. కానీ, కరాటే కళ్యాణిలో చాలా కళలే ఉన్నాయి. ఆమెలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో పాటు డాన్సర్ కమ్ సింగర్ కమ్ కరాటే కమ్ హరికథ.. ఇలా మల్టీ టాలెంటెడ్ ఆమె.

కానీ, ఏమి లాభం ? కరాటే కళ్యాణిలో ఇన్ని ఉన్నా.. ఆమెకు మాత్రం వ్యాంప్ ఆర్టిస్ట్ అనే బిరుదు మాత్రమే మిగిలిపోయింది. అయితే, ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంగతులు పంచుకుంది. తన మనసులోని అనేక ఊసులను చెప్పింది. కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘చాలామందికి భార్య అంటే వంటింటికే పరిమితం అనే భావన ఉంది. భార్య ఏం చెప్తే అది చేయాలి, ఏం చేసినా ఎదురు మాట్లాడకూడదు అనే ఫీలింగ్ చాలామంది మగాళ్లకు ఉంది.
కానీ నేను అందరి లాంటి అమ్మాయిని కాదు. నేను ఫైర్ లాంటి దాన్ని. ఏ మగాడు అయినా అరచేతితో నిప్పును ఆపేయలేరు. పైగా ఎక్కువ సేపు నిప్పుని పట్టుకోలేరు. అందుకే నన్ను అందరూ వదిలేశారు. పైగా నన్ను ప్రేమ, పెళ్లి పేరుతో బాగా వాడుకున్నారు, ఇది నిజం. నా జీవితంలో నిజమైన ప్రేమ నాకు దొరకలేదు. అందుకే ఇప్పటికీ నేను నిజమైన ప్రేమ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. ఒకవేళ నాకు అలాంటి నిజమైన ప్రేమ దొరికితే మాత్రం.. కచ్చితంగా భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటాను.
Also Read: జనసేన కోసం చిరంజీవి పని చేస్తున్నాడా.. పవన్ కోసమే ఆ సినిమా ఒప్పుకున్నాడా ?
అయితే, పెళ్లి చేసుకునే అవకాశం లేకపోతే.. మంచి అబ్బాయి నా కోసం వస్తే.. అప్పుడు నేను సహజీవనానికి కూడా రెడీ. ఎందుకంటే నాకు పిల్లలు అంటే ఇష్టం. ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్నాను. కానీ ఆ కోరిక నాకు ఇప్పటికి తీరలేదు’ అని ఆమె ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. అన్నట్టు ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని.. పైగా ఇప్పటికే అన్ని టెస్ట్ లు చేయించుకున్నానని.. పిల్లల్ని కనే సామర్థ్యం నాకు ఉందని కళ్యాణి చెప్పుకొచ్చింది.

కాగా ఈ వయసులో ఇదేమి కోరిక తల్లా అంటూ నెటిజన్లు కూడా కళ్యాణి కామెంట్స్ కి తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4లో 12వ కంటెస్టెంట్ గా వెళ్లిన కరాటే కళ్యాణి, తన ముక్కుసూటి మనస్తత్వంతో రెండో వారంలోనే ఎలిమినేట్ అయి ఇంటి ముఖం పట్టింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలే ఉన్నా తాన్ మార్క్ ను చూపించింది.
Also Read: ప్రేమ కోసమే పెళ్లి కి దూరంః స్టార్ క్రికెటర్ ను ప్రేమించిన లతా మంగేష్కర్
[…] Erica Fernandes: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇబ్బందులు అనేవి కామన్. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కూడా కెరీర్ స్టార్టింగ్ దశలో ఎన్నోరకలుగా కష్టనష్టాలు పడాల్సి వస్తోంది. అవన్నీ భరించి.. సహించి ముందుకు వెళ్తేనే లైఫ్ వస్తోంది. అయితే, ఎదిగిన తర్వాత ఆ హీరోయిన్లు తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకుని కుమిలిపోతారు. ఒకప్పుడు తమను చాలామంది ఇబ్బంది పెట్టారని అసలు విషయం డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే.. అసలు విషయం దాచేసి.. కోసరు విషయాలను చెప్పుకుంటూ రాద్దాంతం చేసే భామలు కొందరు ఉంటారు. […]
[…] Also Read: మంచి అబ్బాయి దొరికితే సహజీవనానికి రె… […]