BJP President
BJP President: భారతీయ జనతాపార్టీకి మోదీ(Modi), అమిత్‌షా(Amith Sha) రెండు కళ్లు అయితే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మూడో కన్ను. పదేళ్లలో ముగ్గురు అధ్యక్షులు మారారు. ముగ్గురూ దిగ్విజయంగా పార్టీని నడిపించారు. ప్రస్తుతం జగత్‌ప్రకాశ్ నడ్డా(Jagath praksh Nadda). వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన పదవీ కాలం మార్చి 1తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం కమలం నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి, త్వరలోనే జాతీయ అధ్యక్షుడి(Nationa Prasident) ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు. మార్చి 15 లోగా నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నడ్డా వారసుడు ఎవరనేది ఆసక్తిగా మారింది. బీజేపీ రాజ్యాంగం(BJP Constitution) ప్రకారం.. జాతీయ అద్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించేందుకు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలి. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ పూర్తయింది. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కనీసం మరో ఆరు రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో బీజేపీ తన కార్యాచరణను ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, అసోం, గుజరాత్ రాస్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలకు ప్రనాళిక రూపొందించింది.
Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సరికొత్త ఫైర్ బ్రాండ్ ఆమె!
2019 నుంచి నడ్డా..
ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా 2019 నుంచి క ఒనసాగుతున్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక నడ్డాను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలం పొడిగించారు. నడ్డా నాయకత్వంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది. ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమైంది.
రేసులో వీరు..
బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో పలువురి పేర్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, పార్టీ జనరల్ సెకెటరీ సునీల్ బన్సల్, అగ్రనేతలు ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, వినోద్ తావ్డే వంటి ప్రముఖులు ఉన్నారు. అయితే, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎవరనేది నిర్ధారణ కాదు.
Also Read: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏపీకు షాక్.. ఇక ఆ సీట్లనీ మనకే!
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Bjp president election of new national president of bjp by march 20
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com