https://oktelugu.com/

BJP vs KCR : కేసీఆర్ ముందరి కాళ్లకు ముందే బంధం వేసిన బీజేపీ

-రా రైస్ పక్కా కొంటాం…. రైతులను ఆదుకోవడం మా బాధ్యత – తెలంగాణ ప్రభుత్వమే సహకరించడం లేదు -దేశమంతా ప్రొక్యూర్ మెంట్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయం -పార్లమెంట్ సాక్షిగా గతంలోనే ఈ విషయాలన్నింటిపై సమాధానం చెప్పిన – కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టీకరణ – రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ కేంద్రాన్ని బదనాం చేసే కుట్రకు తెరలేపారని బండి సంజయ్ మండిపాటు BJP vs KCR : […]

Written By:
  • NARESH
  • , Updated On : March 21, 2022 / 03:49 PM IST
    Follow us on

    -రా రైస్ పక్కా కొంటాం…. రైతులను ఆదుకోవడం మా బాధ్యత
    – తెలంగాణ ప్రభుత్వమే సహకరించడం లేదు
    -దేశమంతా ప్రొక్యూర్ మెంట్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయం
    -పార్లమెంట్ సాక్షిగా గతంలోనే ఈ విషయాలన్నింటిపై సమాధానం చెప్పిన
    – కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టీకరణ
    – రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ కేంద్రాన్ని బదనాం చేసే కుట్రకు తెరలేపారని బండి సంజయ్ మండిపాటు

    BJP vs KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ముందరి కాళ్లకు ముందే బంధం వేసింది బీజేపీ. తెలంగాణ ధాన్యం కొనుగోలుచేయాలనే డిమాండ్ తో సీఎం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఈమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఢిల్లీలో పోరాటానికి రెడీ అయ్యారు. కానీ అంతముందే బీజేపీ అలెర్ట్ అయ్యింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోని టీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి తెలంగాణ ధాన్యాన్ని కొనేలా కేంద్రాన్ని ఒప్పించారు. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కలిసి కేసీఆర్ ప్లాన్లకు ముందే చెక్ పెట్టారు.

    తాజాగా తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరింత స్ఫష్టత ఇచ్చారు. యాసంగి సీజన్ లోనూ కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ చెప్పారు.దురద్రుష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేస్తున్న విషయాన్ని వివరించారు.

    ఈ సందర్భంగా పీయూష్ స్పందిస్తూ.. ‘ అసలు రా రైస్ కొనబోమని చెప్పిందెవరు? దేశవ్యాప్తంగా బియ్యం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతాం? పక్కా రా రైస్ కొంటాం. రైతులకు ఇబ్బంది కాకుండా చూడటం మా కనీస బాధ్యత. అసలు గతంలో ఇస్తానన్న బియ్యం ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనేలేదు. అయినా దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? పార్లమెంట్ సాక్షిగా గతంలోనే టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చిన. ఇకపై భవిష్యత్తులో తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతం చేసింది కదా.. మళ్లీ వచ్చిన ఇబ్బంది ఏమిటి?’’అని పేర్కొన్నారు.

    సమావేశానంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసం కేసీఆర్ ప్రభుత్వం బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. గతంలోనూ ఇదే అంశంపై కేంద్రాన్ని బదనాం చేసేందుకు పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు, ఢిల్లీకి వచ్చి రాష్ట్ర మంత్రుల బ్రుందం రకరకాల డ్రామాలాడి భంగపడ్డ విషయాన్ని ఈ సందర్భంగా సంజయ్ గుర్తు చేశారు. మళ్లీ యాసంగి పేరుతో టీఆర్ఎస్ కొత్త డ్రామాలకు తెరదీసిందని విమర్శించారు.

    -పసుపు రైతులకు పరిహారంపై కేంద్ర మంత్రితో చర్చించిన ధర్మపురి అరవింద్
    అకాల వర్షాల కారణంగా గతేడాది పసుపు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈరోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావులతో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సైతం ఫసల్ బీమా అమలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు పంపితే… కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.