BJP Focus On KCR: బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ ఫిక్స్‌.. కేసీఆర్‌పై ఫోకస్‌!?

BJP Next Focus On KCR: మహారాష్ట్రలో శివసేన చీలిక.. ఉద్ధవ్‌థాక్రేపై ఎమ్మెల్యేల తిరుగుబాటు.. అందుకు వారు చెబుతున్న కారణాలు చూస్తుంటే తెలంగాణ రాజకీయాలకు దగ్గరగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర లాంటి పరిస్థితే త్వరలో తెలంగాణలో రావొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ‘సీఎం ఉద్ధవ్‌ సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్లు ఇవ్వడంలేదు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు.. ఇతరులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.. అది మాకు అవమానం అనిపించింది’ అని శివసేన ఎమ్మెల్యేలు అంటున్నారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి.. […]

Written By: Raghava Rao Gara, Updated On : June 24, 2022 4:30 pm
Follow us on

BJP Next Focus On KCR: మహారాష్ట్రలో శివసేన చీలిక.. ఉద్ధవ్‌థాక్రేపై ఎమ్మెల్యేల తిరుగుబాటు.. అందుకు వారు చెబుతున్న కారణాలు చూస్తుంటే తెలంగాణ రాజకీయాలకు దగ్గరగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర లాంటి పరిస్థితే త్వరలో తెలంగాణలో రావొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ‘సీఎం ఉద్ధవ్‌ సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్లు ఇవ్వడంలేదు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు.. ఇతరులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.. అది మాకు అవమానం అనిపించింది’ అని శివసేన ఎమ్మెల్యేలు అంటున్నారు.

modi, KCR

తెలంగాణలోనూ అదే పరిస్థితి..
తెలంగాణలోనూ మహారాష్ట్ర లాంటి పరిస్థితి ఉంది. కేసీఆర్‌ కోరుకుంటే తప్ప.. ప్రగతి భవన్‌లోకి ఎవరికీ ఎంట్రీ ఉండదు. ఈటల రాజేందర్‌ తాము ఎన్నిసార్లు అవమానాలకు గురయ్యామో పార్టీ నుంచి గెంటేసిన తర్వాత చెప్పుకున్నారు. హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌లకూ అదే పరిస్థితి వచ్చిందని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌థాక్రే లాగానే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా టీఆర్‌ఎస్‌లో మెజార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు. కేసీఆర్‌ కావాలనుకుంటేనే కలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానేపార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది.

Also Read: Maharashtra Crisis: పార్టీల చేతిలో ప్రజాస్వామ్యం.. అమ్ముడు పోతున్న ఎమ్మెల్యేలు..!

నిధులు ఆ నియోజకవర్గాలకే..
తెలంగాణలో నిధుల కేటాయింపు విషయంలోనూ వివక్ష కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు పలుమార్లు తమ అసంతృప్తిని కూడా బయటపెట్టారు. కేవలం గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకే భారీగా నిధుల కేటాయింపు జరుగుతోంది. గజ్వేల్‌ సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం, సిరిసిల్ల తన కొడుకు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం, సిద్దిపేట తన అల్లుడు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశరావు నియోజకవర్గం. దీంతో వీరు అడగడమే ఆలస్యం నిధులు వెంటనే మంజూరవుతాయి. సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సొంత డబ్బులతో ఏదైనా పనిచేసి బిల్లులు పెట్టుకుంటే నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇక సర్పంచుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. పార్టీ నాయకుల్లో బిల్లులు రావడం లేదన్న ఆగ్రహం కనిపిస్తోంది. సర్పంచులైతే అప్పుల తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి.

KCR, modi

తెలంగాణ ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తే..
మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీ చీలిక వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. ఈమేరకు ఏక్‌నాథ్‌షిండే కూడా తమకే ఒక శక్తి అండ లభించిందని ప్రకటించారు. తమను ఎవరూ భయపెట్టలేరని పేర్కొనడం బలమైన మద్దతు ఉందని చెప్పకనే చెప్పారు. నెక్ట్స్‌ తెలంగాణలోనూ బీజేపీ అధికార టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే హరీశ్‌రావు కూడా పార్టీ మారడానికి వెనుకాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు బలమైన కారణం కూడా చెబుతున్నారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి. కానీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. దివంగత నేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో నాడు హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌తో ఉంటే లాభం లేదని రహస్యంగా వైఎస్సార్‌ను కలిశారు. తాజాగా బీజేపీ మళ్లీ హరీశ్‌ను టార్గెట్‌ చేస్తే టీఆర్‌ఎస్‌ విచ్ఛిన్నం బీజేపీకి అంత కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మహారాష్ట్రలో బీజేపీకి కొంత బలం ఉంది. శివసేన ఎమ్మెల్యేలను చీల్చితే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో అలాంటి పరిస్థితిలేదు. ఏం చేసినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడదు. అదే సమయంలో కేసీఆర్‌ను కాదని పార్టీని చీల్చే నాయకులు కొద్దిమందే ఉన్నారు. వారుతిరుగుబాటు చేస్తారో లేదో చెప్పడం కష్టం. కానీ ప్రజలు, టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తున్న అసంతృప్తిని బీజేపీ ఉపయోగించుకోదల్చుకుంటే మాత్రం మహారాష్ట్ర రాజకీయాలను తెలంగాణలో చూసినా ఆశ్చర్యం లేదని కొంత మంది అంటున్నారు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు.. ఎందుకంటే థాక్రే ఫ్యామిలీనే ఎమ్మెల్యేలు వద్దనుకుంటారని ఎవరూ ఊహించలేదు మరి!

Also Read:KCR National Party: బీజేపీతో ఇప్పుడే వద్దు.. కేసీఆర్ జాతీయ పార్టీ గోవిందా..!

Tags