RSS- Maharashtra Political Crisis: ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడ.. ‘మహా’ సంక్షోభంపై అందుకే స్పందించడం లేదా!?

RSS- Maharashtra Political Crisis: అఖండ హిందూ భారతమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌(రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌). 1925లో నాగపూర్‌లో పురుడు పోసుకున్న ఈ సంస్థ ప్రధాన లక్ష్యం భారతీయ హిందూ సమాజాన్ని ఐక్యం చేయడం. భారతీయ సంస్కృతిని, పౌర సమాజం విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తుంది. హిందుత్వ భావజాలాన్ని వ్యాపింపజేస్తుంది. ఒక హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో హిందూ వాదులకు, హిందూ సమాజారికి అన్నివిధాలుగా అండగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ, […]

Written By: Raghava Rao Gara, Updated On : June 24, 2022 3:31 pm
Follow us on

RSS- Maharashtra Political Crisis: అఖండ హిందూ భారతమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌(రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌). 1925లో నాగపూర్‌లో పురుడు పోసుకున్న ఈ సంస్థ ప్రధాన లక్ష్యం భారతీయ హిందూ సమాజాన్ని ఐక్యం చేయడం. భారతీయ సంస్కృతిని, పౌర సమాజం విలువలను సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తుంది. హిందుత్వ భావజాలాన్ని వ్యాపింపజేస్తుంది. ఒక హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో హిందూ వాదులకు, హిందూ సమాజారికి అన్నివిధాలుగా అండగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ, శివసేనకు ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నాటి ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే నేడు బీజేపీ, శివసేనలో పెద్ద రాజకీయ నేతలుగా ఉన్నారు. హిందుత్వ వాద పార్టీలను గెలిపించడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థులను, ముఖ్యమంత్రి, మంత్రుల ఎంపిక విషయంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ ముద్ర కచ్చితంగా ఉంటుంది. ఇదే సమయంలో ఆ పార్టీలు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అండగా నిలుస్తుంది. కానీ తాజాగా మహారాష్ట్ర సంక్షోభం విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు.

uddhav thackeray eknath shinde

బాల్‌థాక్రేతో సత్సంబంధాలు..
బాల్‌థాక్రే ఈ పేరు వింటేనే ఒకప్పుడు మహారాష్ట్ర గడగడలాడేది. పక్కా హిందుత్వ వాదిగా ఉన్న బాల్‌థాక్రేతో ఆర్‌ఎస్‌ఎస్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. థాక్రే స్థాపించిన శివసేన మొదట్లో ఆర్‌ఎస్‌ఎస్‌లాగానే హిందుత్వ వ్యాప్తి కోసమే పనిచేసింది. ఇద్దరిదీ ఒకే దారి కావడంతో సహజంగానే కలిసి పనిచేశాయి. బాల్‌థాక్రే స్థాపించిన శివసేత కాలక్రమేణా రాజకీయ పార్టీగా మారింది. అయితే ఎన్నడూ తన లక్ష్యాన్ని మాత్రం విస్మరించలేదు. మరోవైపు తన కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన థాక్రే తానుమాత్రం ఎన్నడూ పదవుల కోసం ఆశపడలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇదే ఆయన లక్ష్యాన్ని, అఖండ హిందూ దేశంపై నిబద్దతను తేలియజేస్తుంది. అధికారం లేకున్నా శాసించేస్థాయిలో ఉండేవారు బాల్‌థాక్రే. ఆయన ఉన్నత వరకు కాంగ్రెస్‌ పార్టీ శివసేస నీడను కూడా టచ్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. కానీ బాల్‌థాక్రే మరణానంతరం అధికార ఆకాంక్ష, రాజకీయ అపరిపక్వత పార్టీ లక్ష్యాన్ని నీరుగార్చింది.

Also Read: BJP Focus On KCR: బీజేపీ నెక్ట్స్‌ టార్గె్గట్‌ ఫిక్స్‌.. కేసీఆర్‌పై ఫోకస్‌!?

అందుకే దూరం..
శివసేన మొదటి లక్ష్యం హిందుత్వ పరిరక్షణ.. అధికారం, రాజకీయాల గురించి అంతగా పట్టించుకునది కాదు. కానీ బాల్‌థాక్రే మరణం తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆయన తనయుడు ఉద్ధవ్‌ థాక్రే.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. ఎన్నికల్లో పోటీ చేశారు. దీనికి కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అభ్యంతరం చెప్పలేదు. హిందు సామ్రాజ్య స్థాపన లక్ష్యాన్ని మరువొద్దని మాత్రం సూచించేది. శివ సైనికులు కూడా హిందుత్వ సమాజమే లక్ష్యంగా పనిచేశారు. చేస్తున్నారు. కానీ 2019 ఎన్నికల సమయంలో ఉద్ధవ్‌ భార్య తనకు రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించింది. ఈమేరకు ఉద్ధవ్‌కు, పార్టీ కీలక నేత సంజయ్‌రౌత్‌కు తన ఆకాంక్ష తెలిపింది. దీనికి వారు కూడా అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఆదిత్య థాక్రే ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన థాక్రే కుటుంబానికి చెందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో ఉద్ధవ్‌ భార్యకు అధికారం కూడా దక్కించుకోవానే కోరిక కలిగింది. దీంతో బాల్‌థాక్రే ఆశయాన్ని, శివసేన పార్టీ వ్యవస్థాపక ఉద్దేశాన్ని పక్కన పెట్టేశారు. మిత్రపక్షం బీజేపీతో విభేదించి ఏ పార్టీ అయితే శివసేన దగ్గరకు రావడానికి భయపడేదో అదే పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు శివ సైనికులకు నచ్చలేదు. కానీ నాటి పరిస్థితులతో మహా వికాస్‌ అఘాడీ పేరుతో కూటమిగా ఏర్పడిన శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ శివసేనకు దూరమైంది.

RSS

నాటి పరిస్థితే నేటి మౌనానికి కారణం..
కాంగ్రెస్‌ అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌కు అసలే పడదు. అలాంటి పార్టీతో శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, చిరకాల మిత్రపక్షం బీజేపీని దూరం పెట్టడం ఆర్‌ఎస్‌ఎస్‌కు నచ్చ లేదు. దీంతో దాదాపు మూడేళ్లుగా శివసేనతో కలిసి పనిచేయడం లేదు. తాజాగా ఏర్పడిన సంక్షోభం సమయంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యనేతలెవరూ స్పందించడం లేదు. దీనికి కారణం శివసేన హిందుత్వ ఎజెండాను పక్కన పెట్టి కాంగ్రెస్‌తో కలవడమే కారణమని తెలుస్తోంది. లేకుండా ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగి సంక్షోభ నివారణ చర్యలు చేపట్టేవారు.

Also Read:KCR National Party: బీజేపీతో ఇప్పుడే వద్దు.. కేసీఆర్ జాతీయ పార్టీ గోవిందా..!

Tags