https://oktelugu.com/

జగన్ బెయిల్ పై బీజేపీ వ్యాఖ్యల కలకలం!

ఏపీ సీఎం జగన్ కు, మంత్రులకు షాకిచ్చేలా బీజేపీ వ్యవహరిస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. సీఎం జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దు కావచ్చని బీజేపీ బాంబు పేల్చింది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ఏపీ బీజేపీ బాధ్యులు, జాతీయ బీజేపీ నేత సునీల్ ధియేధర్ కావడం విశేషం. ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు సునీల్ కౌంటర్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీకి, వైసీపీకి స్నేహం ఉంది. రెండు పార్టీలు సహకరించుకుంటాయి. పార్లమెంట్ లో […]

Written By: , Updated On : August 7, 2021 / 06:43 PM IST
Follow us on

ఏపీ సీఎం జగన్ కు, మంత్రులకు షాకిచ్చేలా బీజేపీ వ్యవహరిస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. సీఎం జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దు కావచ్చని బీజేపీ బాంబు పేల్చింది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ఏపీ బీజేపీ బాధ్యులు, జాతీయ బీజేపీ నేత సునీల్ ధియేధర్ కావడం విశేషం. ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు సునీల్ కౌంటర్ ఇచ్చారు.

జాతీయ స్థాయిలో బీజేపీకి, వైసీపీకి స్నేహం ఉంది. రెండు పార్టీలు సహకరించుకుంటాయి. పార్లమెంట్ లో బీజేపీకి వైసీపీకి మద్దతు ఇస్తుంటుంది. అయితే కొద్దిరోజులుగా మాత్రం బీజేపీ తీరు మారుతోంది. పార్టీల మధ్యన ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

తొలిసారి పార్లమెంట్ లో కేంద్రానికి వ్యతిరేకంగా వైసీపీ నినాదాలు చేసింది. మోడీ సభలో ఉండగానే వెల్ లోకి వెళ్లి నిరసనలు తెలిపింది. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలను అజెండాగా పెట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. పార్లమెంట్ బయట కూడా మాటల దాడి ఆపలేదు.

ఇక ఏపీ కేబినెట్ లోనూ బీజేపీ తీరుపై సీఎం జగన్ తీవ్రంగా విమర్శించారు. ఇద్దరు బీజేపీ నేతల విమర్శలకు ఎందుకు కౌంటర్లు ఇవ్వడం లేదని మంత్రులను నిలదీశారు. దీంతో మంత్రి పేర్నినాని విలేకరుల సమావేశంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. మిగతా మంత్రులు బీజేపీ నేతలపై రెచ్చిపోయారు.

ఈ క్రమంలోనే తాజాగా ఏపీ బీజేపీ నేత సునీల్ ధియోధర్ కీలక వ్యాక్యలు చేశారు. ‘ఏపీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదని.. ఏ క్షణాన జగన్ బెయిల్ రద్దు అవుతుందో తెలియక.. రోజూ గడవడానికి అప్పు పుట్టక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి అది చాలదన్నట్టుగా ప్రభుత్వానికి పాతాళమంత లోటు గొయ్యి తవ్వి రెడీ ఉంటారు’ అంటూ ఘాటు గా కౌంటర్ ఇచ్చారు.

తాజాగా ఘటనలు వైసీపీ, బీజేపీ మధ్య పూడ్చలేనంతగా గ్యాప్ పెంచాయని అర్థమవుతోంది. జగన్ ను టార్గెట్ గా బీజేపీ ఏదో రాజకీయ మంత్రాంగం నడుపుతోందని తెలుస్తోంది. ఈ పరిణామాలు వైసీపీవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.