టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్ కు హర్యానా సర్కారు రూ. 6 కోట్ల భారీ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. 23 ఏండ్ల నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. దాంతో భారత్ కు ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో 100 ఏళ్ల తర్వాత తొలి స్వర్ణం వచ్చినట్లయ్యింది.