డిజిటల్ ప్రచారంలో దూసుకెళుతున్న బీజేపీ?

కరోనాకు సాకుతో ఎన్నికలు వాయిదా వేయడం కుదరని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది. దీంతో కరోనా సమయంలోనూ అధికార, ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇక బీహార్ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో కేంద్రంలోని బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి. అయితే బీజేపీ అధిష్టానం కరోనాను ఎదుర్కొంటూ ప్రచారంలో దూసుకెళ్లేందుకు మందస్తుగానే వ్యూహాలు రెడీ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. Also Read: సంచలన […]

Written By: NARESH, Updated On : September 6, 2020 3:03 pm

Bjp it cell

Follow us on


కరోనాకు సాకుతో ఎన్నికలు వాయిదా వేయడం కుదరని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది. దీంతో కరోనా సమయంలోనూ అధికార, ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇక బీహార్ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో కేంద్రంలోని బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి. అయితే బీజేపీ అధిష్టానం కరోనాను ఎదుర్కొంటూ ప్రచారంలో దూసుకెళ్లేందుకు మందస్తుగానే వ్యూహాలు రెడీ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..?

ప్రస్తుతం దేశంలో కరోనా ఎఫెక్ట్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. దేశంలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ పాజిటివ్ బారినపడే వారిసంఖ్య భారీగా పెరిగింది. కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు అమెరికాతో పోటీపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడమంటే కత్తి మీద సాము చేయడం లాంటిదే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి వాటిని ముందుగానే ఊహించిన బీజేపీ అధిష్టానం మిగతా పార్టీల కంటే ముందుగా డిజిటల్ ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంది.

దేశంలో సమర్థవంతంగా సోషల్ మీడియాను వినియోగించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ముందుగానే విన్పించేది బీజేపీ పేరే. బీజేపీ నేతలందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కన్పిస్తుంటారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతోపాటు.. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేలా ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాను విస్కృతంగా వాడుతుంటం చూస్తూనే ఉన్నాం. దీంతో మిగతా పార్టీలు సైతం సోషల్ మీడియాపై అవగాహన పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రతీఒక్కరికి డిజిటల్ సేవలు అందుబాటులో ఉండటంతో అన్ని పార్టీలు కూడా దీనిపై దృష్టిసారిస్తున్నాయి.

Also Read: ముఖేశ్‌ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్‌ అంచనా వేయగలమా..!

బీహార్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు రాష్ట్ర నేతలకు అధిష్ఠానం మార్గదర్శకాలను జారీ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ ఉండాలో 5నిమిషాల నిడివితో డాక్యుమెంటరీలను బీజేపీ రూపొందించినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీలో ‘డిజిటల్ ర్యాలీ’కి రూపకల్పన చేశారు.

ఒక్కో బీజేపీ ఎంపీ 60గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేయాలని అధిష్టానం ఇప్పటికే సూచించినట్లు సమాచారం. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విరివిగా యూబ్యూబర్స్ సేవలను వాడుకుంది. అయితే అక్కడ పరిస్థితుల కారణంగా ఓటమి చెందింది. అయితే బీహార్లో మాత్రం పకడ్బంధీగా ప్రచారంలో దూసుకెళ్లేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక  ప్రతిపక్షాలు డిజటల్ ప్రచారాన్ని ఏమేరకు ఉపయోగించుకుంటారో వేచిచూడాల్సిందే..!