https://oktelugu.com/

రేపటి నుంచి అసెంబ్లీ: టీఆర్ఎస్ vs కాంగ్రెస్ ఫైటేనా?

ఈసారి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సమావేశాలు హాట్‌హాట్‌గా జరిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. విపక్షాలు, అధికార పక్షం వ్యూహ, ప్రతివ్యూహాలకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్‌‌ కరోనా కట్టడిలో ఫెయిల్‌ అయ్యారు. దీనికితోడు సచివాలయాన్ని కూల్చడం.. కొత్త సెక్రటరేటియట్‌ నిర్ణయం తీసుకోవడం. మరోవైపు నిర్బంధ సాగు.. ఉస్మానియా వైఫలం.. ఇవన్నీ ప్రతిపక్షాలకు కలిసొచ్చే అంశాలు. వీటన్నింటికీ తోడు కేసీఆర్‌‌ ముఖ్యంగా ఫామ్‌హౌజ్‌కు పరిమితం కావడం. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమగ్రంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 / 01:59 PM IST

    Telangana Assembly

    Follow us on

    ఈసారి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సమావేశాలు హాట్‌హాట్‌గా జరిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. విపక్షాలు, అధికార పక్షం వ్యూహ, ప్రతివ్యూహాలకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్‌‌ కరోనా కట్టడిలో ఫెయిల్‌ అయ్యారు. దీనికితోడు సచివాలయాన్ని కూల్చడం.. కొత్త సెక్రటరేటియట్‌ నిర్ణయం తీసుకోవడం. మరోవైపు నిర్బంధ సాగు.. ఉస్మానియా వైఫలం.. ఇవన్నీ ప్రతిపక్షాలకు కలిసొచ్చే అంశాలు. వీటన్నింటికీ తోడు కేసీఆర్‌‌ ముఖ్యంగా ఫామ్‌హౌజ్‌కు పరిమితం కావడం. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరిస్తూ విపక్షంపై ఎదురుదాడికి దిగేందుకు అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేస్తోంది. కొవిడ్‌కు సంబంధించి పరీక్షల నిర్వహణ, కట్టడి చర్యలు ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి? తెలంగాణలో పరిస్థితి? ఏంటన్న దానిపై ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ కూడా పూర్తి స్థాయులో సమాచారం సేకరించినట్లు సమాచారం. మరోవైపు విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం కేసీఆర్‌ కూడా ఇప్పటికే మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

    Also Read: గుడ్‌న్యూస్‌..: ప్రజలకు ఇక ఎమ్మార్వో, వీఆర్‌‌వోల వేధింపులుండవ్‌..

    కరోనా కట్టడితోపాటు సహాయక చర్యల్లో వైఫల్యం, ఉపాధి అవకాశాలు దెబ్బతిని సామాన్యులు ఇబ్బందుల పాలవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం, ఏపీ జల దోపిడీ, రైతాంగ సమస్యలను లేవనెత్తాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, సౌకర్యాల లేమిపై సమగ్ర సమాచారాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సేకరించి పెట్టుకున్నారు. ఆరుగురు సభ్యులే ఉన్నప్పటికీ ప్రభుత్వంపై దీటుగా దాడి చేయాలన్న ఎత్తుగడతో ఆ పార్టీ ఉంది. సోమవారమే సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎజెండాను ఖరారు చేసుకుంటున్నారు. అలాగే, మీడియా పాయింట్‌ ఉండబోదని స్పీకర్‌ ప్రకటించిన నేపథ్యంలో దాన్ని కొనసాగించేలా బీఏసీలో పట్టుబట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.

    మరోవైపు కొవిడ్‌ నేపథ్యంలో కేంద్రం చేసిన సాయం.. వాటి లెక్కలు బయట పెట్టాలని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలనూ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. కేంద్రం మంజూరు చేసిన నిధులను ఏ మేరకు ఖర్చు చేశారన్న దానిపైనా ప్రభుత్వాన్ని నిలదీయనుంది.

    Also Read: కరోనా కాఠిన్యం: చెదిరిపోతున్న జర్నలిస్టులు

    వీటన్నింటినీ ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర సర్కార్ కూడా దీటుగా సమాధానం ఇవ్వడానికే రెడీ అవుతోంది. విపక్షాలపై ఎదురుదాడి చేసే ఎత్తుగడను అవలంబించాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో ట్రబుల్‌ షుటర్‌‌ అయిన మంత్రి హరీశ్‌ రావు ఈసారి సమావేశాలకు దూరంగానే ఉండనున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఎదురుదాడి ఎవరి నుంచి మొదలవుతుందా అని ఆసక్తి నెలకొంది. ఇందుకు మంత్రి ఈటల రాజేందర్‌, ఆయనకు సహాయంగా మరో ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలనూ రంగంలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీశైలం ప్రమాద ఘటన, ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై అసెంబ్లీ వేదికగానే సమాధానం చెప్పాలని భావిస్తోంది. జీఎస్టీ లోటును కేంద్రం భర్తీ చేయకపోవడంతో రాష్ట్రానికి జరుగతున్న నష్టం, రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలను పెండింగ్‌లో ఉంచడం వంటి అంశాలను ప్రస్తావించి బీజేపీని కార్నర్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.