నందిగ్రామ్ అంటే ముందుగా గుర్తొచ్చేది భూపోరాటమే. అక్కడ ఏర్పాటు చేయదలచిన టాటా నానో ఫ్యాక్టరీ భూసేకరణ వివాదం.. పాలక పార్టీగా ఉన్న సీపీఎం పునాదుల్ని కదిలించేసింది. మమతా బెనర్జీకి పీఠం అందించేలా చేసింది. అయితే.. ఇప్పుడు అక్కడి నుంచే తమ పీఠం కదలబోతోందని అంచనాకు వచ్చింది దీదీ. దీంతో వెంటనే తేరుకొని మమత బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. నందిగ్రామ్ వేదికగా బరిలోకి దిగుతున్నారు. నందిగ్రామ్‌కు వెళ్లి ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. తానే స్వయంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు.
Also Read: బెంగాల్‌లో మమతా బెనర్జీ బీజేపీని ఢీకొట్టే ప్లాన్ ఇదే..
రెండో చోట పోటీ చేయడం లేదు. గెలిస్తే.. తాను గెలిచినట్లు.. లేకపోతే.. మొత్తంగా ఓడిపోయినట్లు. విజయమో.. వీర స్వర్గమో తేల్చుకోవాలని మమతా బెనర్జీ అలా డిసైడయినట్లుగా తేలుతోంది. నందిగ్రాంలో సువేందు అధికారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తృణమూల్ తరపునే దాదాపుగా 90 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. నిన్నామొన్నటి దాకా మమత కేబినెట్‌లో ఆయన మంత్రి కూడా. కానీ.. ఇప్పుడు బీజేపీలో చేరారు. నందిగ్రాం బెల్ట్ మొత్తం ఆయనకు పట్టు ఉంది. ఒకవేళ ఆయనను అలా బీజేపీకి వదిలిస్తే.. ఆ బెల్ట్ మొత్తం తృణమూల్‌కు ఓటమి ఎదురవుతుంది.
Also Read: ఆ సీడీలను ప్రసారం చేయొద్దు.. రాసలీలల సీడీలపై కోర్టుకెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు
అయితే.. ఆయనను ఎదిరిస్తేనే ప్రయోజనమని.. అదీ కూడా.. ఆయనకు దీటైన నేత పోటీ పడాలని డిసైడయింది. మమతా బెనర్జీ మాత్రం స్వయంగా ఆయనను ఎదుర్కోవాలని డిసైడయ్యారు. నందిగ్రామ్‌లో అధికారి బ్రదర్స్‌కు పలుకుబడి ఉన్నా అది సొంతం కాదని నిరూపించాలని మమత డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఈ ఎన్నికల్లో స్వయంగా నందిగ్రామ్ నుంచి బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
అంతేకాదు.. ఈ ఎన్నికలు మమతా బెనర్జీకి తాడో పేడో అన్నట్లుగా మారాయి. అందుకే ఆమె తాను గెలిస్తే పార్టీ గెలుస్తుంది..లేకపోతే లేదన్నట్లుగా తేల్చుకోవాలనుకుంటున్నారు. నందిగ్రామ్‌లో సువేందు అధికారినే అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసింది. బెంగాల్‌లో ఇప్పుడు.. ఎక్కడ చూసినా తృణమూల్ వర్సెస్ తృణమూల్ అన్నట్లుగా పోరు సాగుతోంది. ఒక్క నందిగ్రామ్ మాత్రమే కాదు.. అనేకచోట్ల తృణమూల్ నేతలతో పోటీ పడుతోంది. ఇటీవలి కాలంలో ఉద్యమంలా పోయి..బీజేపీలో చేరిన తృణమూల్ నేతలే. చివరికి మమతా బెనర్జీపై పోటీ పడేది కూడా.. వలస నేతపూనే. మొత్తంగా ఈసారి బెంగాల్ రాష్ట్ర రాజకీయాలు.. ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Bjp list out suvendu vs didi in nandigram
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com