https://oktelugu.com/

BJP leader Tarun Chugh comments : తెలంగాణలో రాజకీయ కాక.. బీజేపీతో టచ్ లో ఉన్న ఆ పాతిక మంది ఎవరు?

BJP leader Tarun Chugh comments : బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపాయనే చెప్పాలి. రాష్ట్రంలో ఒక చర్చకు తరుణ్ వ్యాఖ్యలు దారితీశాయి. తెలంగాణ బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. పెద్దగా చర్చ జరిగేది కాదు. […]

Written By:
  • Rocky
  • , Updated On : November 27, 2021 / 12:04 PM IST
    Follow us on

    BJP leader Tarun Chugh comments : బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపాయనే చెప్పాలి. రాష్ట్రంలో ఒక చర్చకు తరుణ్ వ్యాఖ్యలు దారితీశాయి. తెలంగాణ బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ.. రాష్ట్ర వ్యవహారాలు చూసే.. జాతీయ నేత ఇలాంటి కామెంట్ చేయడంతో.. పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఢిల్లీలో గట్టి షాక్ తగిలిందని అన్నారు తరుణ్ చుగ్. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. అంతేకాదు.. కేసీఆర్ కు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదని ఆన్నారు. ఒకటీ రెండు చోట్లకాదు.. ఏకంగా 60 స్థానాల్లో గులాబీ పార్టీకి అభ్యర్థులు ఉండరని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఒకెత్తయితే.. మరో బాంబు పేల్చారు తరుణ్.

    తెలంగాణలో తమ పార్టీలో చేరడానికి చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచే.. ఏకంగా 25 మంది నాయకులు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రొటీన్ పొలిటికల్ కామెంట్లు అనుకోవడానికి.. ఆయనేం సాధారణ నేత కాదు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు చూసే.. జాతీయ నేత కావడంతో.. ఈ వ్యాఖ్యల్లో నిజమెంత? ఆ పాతిక మంది ఎవరై ఉంటారు? అనే చర్చ సాగుతోంది.

    తరుణ్ చుగ్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం కూడా చర్చనీయాంశం అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థిలేని బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పడానికి మించిన హాస్యం ఏముందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. అటు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు కూడా స్పందించారు. రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో గెలిచేది తామేనని అన్నారు. తరుణ్ చుగ్ వ్యాఖ్యల్లో నిజం లేకపోతే.. వీరు స్పందించాల్సిన అవసరమేంటి? అనే చర్చ సాగుతోంది. మొత్తానికి ఆ 25 మంది ఎవరో తెలియదుగానీ.. బీజేబీ కామెంట్స్ మాత్రం చర్చనీయాంశంగా మారాయి.