Genelia: కొడుకు పుట్టినరోజున జెనిలియా ఎమోషనల్​ పోస్ట్​

Genelia: బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించి.. హాసినిగా అందరి హృదయాల్లో నిలిచిపోయింది జెనిలియా.  ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు నటించి.. బాలీవుడ్ హీరో రితేశ్​ దేశ్​ముఖ్​తో ప్రేమలో పడి.. వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా స్వస్థి చెప్పి.. ఇంటికే పరిమితమైంది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. జెనిలియా సినిమాలకు దూరమైనప్పటికీ.. తన వ్యక్తిగత జీవితం, కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్​మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. https://www.instagram.com/p/CWr6Ak2oOVU/?utm_source=ig_web_copy_link తాజాగా తన పెద్ద […]

Written By: Raghava Rao Gara, Updated On : November 27, 2021 12:29 pm
Follow us on

Genelia with her son

Genelia: బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించి.. హాసినిగా అందరి హృదయాల్లో నిలిచిపోయింది జెనిలియా.  ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు నటించి.. బాలీవుడ్ హీరో రితేశ్​ దేశ్​ముఖ్​తో ప్రేమలో పడి.. వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా స్వస్థి చెప్పి.. ఇంటికే పరిమితమైంది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. జెనిలియా సినిమాలకు దూరమైనప్పటికీ.. తన వ్యక్తిగత జీవితం, కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్​మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.

https://www.instagram.com/p/CWr6Ak2oOVU/?utm_source=ig_web_copy_link

తాజాగా తన పెద్ద కుమారుడు రియాన్ పుట్టినరోజు సందర్భంగా.. ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్​ పోస్ట్ పెట్టింది జెనిలియా. ప్రియమైన రియాన్‌.. ఇంత చిన్ని బుర్రలో ఎన్నో కోరికలు, ఆశలు ఉన్నాయి.. వాటన్నింటినీ నేను దగ్గరుండి నెరవేరుస్తానని ఇప్పుడు నీకు మాటిస్తున్నా.. నువ్వు ఎగరానుకున్నప్పుడు.. ఆ రెక్కను కాలేకపోయినా.. వాటికింద గాలినై నీకు అండగా ఉంటా.. రాసుకొచ్చింది.

Also Read: బిగ్​బాస్​ హోస్ట్​గా రమ్యకృష్ణ.. ఇందులో నిజమెంత?

Genelia with kids

ప్రతి విషయంలో నువ్వు టాప్​లో ఉండాలని అనుకోవట్లేదు.. నువ్వు ఎలా ఉన్నా నీ స్టైల్​ నీకు ఉంటుంది. అదే నాకు కావాలి. ఎప్పుడూ నీకు తోడుగా ఉంటూ.. నిన్ను కాపాడుకుంటా.. అని ఎమోషనల్​ అవుతూ పోస్ట్ చేసింది జెనిలియా. ఈ క్రమంలోనే తన కుమారుడితో కలిసి దిగిన  ఫొటోలను షేర్​ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ఈ సినిమాకు అనసూయ అందం, నటనే ఆకర్షణ- ఫ్లాష్​బ్యాక్​ టీమ్