TTD Online Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్ లను విడుదల చేశారు. ఈ క్రమంలోనే రోజుకు పది వేల టోకెన్లను విడుదల చేసినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. ఈ విధంగా శ్రీవారి సర్వదర్శనం టోకెన్ లను విడుదల చేసిన 13 నిమిషాల్లోనే సుమారు రెండు లక్షల 80 వేల టోకెన్లను బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: టీటీడీలో సంపన్నులదే రాజ్యం.. వారి క్లబ్ గా మారిపోయిందా?
గత రెండు సంవత్సరాల నుంచి కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో టిటిడి అధికారులు భక్తుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మొదటగా అధికారులు స్వామివారి దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మాత్రమే విడుదల చేసింది.అదేవిధంగా గత రెండు నెలల నుంచి పరిమిత సంఖ్యలో సర్వదర్శనం టోకెన్ లను విడుదల చేస్తూ వచ్చింది.
ఈ విధంగా స్వామివారి సర్వ దర్శనం టోకెన్ల విడుదలను అధికం చేస్తూ వచ్చిన అధికారులు నేడు ప్రతి రోజు ఏకంగా పది వేల స్వామివారి సర్వ దర్శనం టోకెన్లను బుక్ చేసుకొని చేసుకుని వెసులుబాటు కల్పించారు. అయితే ఈ సర్వ దర్శనం టోకెన్లను ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా టీటీడీ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి అందులో సర్వదర్శనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ పేరు ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు తిరుమలకు వెళ్లే సమయంలో టికెట్ ప్రింట్ అవుట్ తో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లినప్పుడు మాత్రమే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి తెలుపుతారు.
Also Read: సినిమా టికెట్ల రేట్లు పెంపుపై కండిషన్స్ అప్లయ్..!