
బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన మోత్కుపల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకుడు అయ్యింది ఎన్టీఆర్ వల్లే అన్నారు. దీనిపై సీఎంకు కనీసం ఆ కృతజ్ఞత ఉంటే కేసీఆర్.. ఎన్టీఆర్ ఘాట్‌కి రావాలని డిమాండ్ చేశారు.
Also Read: ఇక నుంచి ఇంటి అడ్రస్ కనుక్కోవడం ఈజీ..: ఎలానో తెలుసా!
అంతేకాదు.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది ఎన్టీఆర్ వల్లేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఎన్నో పాపాలు చేస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. అందుకే ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలను కేసీఆర్ అధికారికంగా నిర్వహించి ఆయన రుణం తీర్చుకోవాలన్నారు.
Also Read: కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్..? : కేటీఆర్ సీఎం వద్దంట
ఎన్టీఆర్ పేరును కేసీఆర్ ఆయన కుమారుడికి పెట్టుకున్నారు సంతోషమే. కానీ.. నాలాంటి పేదవారి మాటలు ముఖ్యమంత్రి దగ్గరకు చేరడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంస్కరణలు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అంటూ గుర్తుచేసుకున్నారు మోత్కుపల్లి. వ్యవస్థ కోసం ఎన్నో మార్పులు చేసి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు ఎంతో చేశారని.. ఆయన శిష్యుడిగా తాను ఎంతో గర్విస్తున్నానన్నారు మోత్కుపల్లి. సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు నిలిచి ఉంటుందన్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని మోత్కుపల్లి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.మోత్కుపల్లి వ్యాఖ్యలపై అటు సీఎం గానీ.. లేక టీఆర్‌ఎస్ లీడర్లు గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్