https://oktelugu.com/

రాజధాని నడిబొడ్డున బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

బీహార్.. అంటు కూనికోరులకు.. గుండాలు, రౌడీలకు ఒకప్పుడు ఫేమస్. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ గెలిచాక కాస్త ఈ అరాచకం తగ్గింది. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే మళ్లీ అరాచకం మొదలైంది. బీహార్ లో ఏకంగా అధికార బీజేపీ నేతను రాజధాని నడిబొడ్డున కాల్చిచంపడం తీవ్ర దుమారం రేపింది. Also Read: ‘అమరావతి’ ఆందోళన.. రాష్ట్రమంతా సాధ్యమేనా? ఇటీవలే పాట్నాకు చెందిన రాజేశ్ కుమార్ జా బీజేపీలో చేరారు. ఆయనపై ప్రత్యర్థులు కాల్చి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 / 09:48 AM IST
    Follow us on


    బీహార్.. అంటు కూనికోరులకు.. గుండాలు, రౌడీలకు ఒకప్పుడు ఫేమస్. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ గెలిచాక కాస్త ఈ అరాచకం తగ్గింది. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే మళ్లీ అరాచకం మొదలైంది. బీహార్ లో ఏకంగా అధికార బీజేపీ నేతను రాజధాని నడిబొడ్డున కాల్చిచంపడం తీవ్ర దుమారం రేపింది.

    Also Read: ‘అమరావతి’ ఆందోళన.. రాష్ట్రమంతా సాధ్యమేనా?

    ఇటీవలే పాట్నాకు చెందిన రాజేశ్ కుమార్ జా బీజేపీలో చేరారు. ఆయనపై ప్రత్యర్థులు కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

    రాజేశ్ కు బాగా తెలిసిన వ్యక్తులే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఏకంగా అధికార బీజేపీనేతను కాల్చి చంపడం ఉద్రిక్తతకు దారితీసింది.

    బీజేపీ నేత రాజేశ్ జా మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అత్యంత సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నాయి. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ దారుణం  చోటుచేసుకోవడం కలకలం రేపింది. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నడిబొడ్డున బీజేపీకి చెందిన ఓ నేతను దుండగులు కాల్చి చంపారు.

    Also Read: రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాడుతా: కేసీఆర్ సంచలనం|

    బీహార్ అసెంబ్లీ బరిలో ఈసారి జేడీయూ-బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకొని పోటీచేస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి బరిలో నిలుస్తున్నాయి. ఈసారి హోరాహోరీ పోరు తప్పేలా లేదు.