BJP- Pawan Kalyan: ఎనిమిదేళ్లగా మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీపై బీజేపీకి అనుమానాలు మొదలయ్యాయా?.. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని అనుమానిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకే బీజేపీ అధినాయకులు ఇతర సినిమా స్టార్స్‌పై దృష్టి పెడుతున్నారని పేర్కొంటున్నారు. తనకు శత్రువుగా వ్యవహరించిన టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తుకు ప్రయత్నిస్తున్నారని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇక తమతో ఉండడేమో అని భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో తాను ఆశించిన విధంగా వైఎస్సార్‌సీపీ విధాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని పవన్‌కళ్యాణ్ భావిస్తున్నారు. పరస్పర అనుమానాలతో ఎనిమిదేళ్ల దోస్తీకి బీటలు వారే అవకాశం ఎక్కుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సినీ గ్లామర్‌పై బీజేపీ దృష్టి..
బీజేపీ మొదటి నుంచి సినీ గ్లామర్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగానే ఉత్తరాదిన సీనియర్ సినీ నటి హేమామాలిని, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇటీవల గోవాలో చనిపోయిన టీవీ నటి ఫోగట్‌తోపాటు, దక్షిణాదిన రజినీ కాంత్‌ను కాషాయ నేతలు సమావేశాలు కావడ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సౌందర్యతో ఎన్నికల ప్రచారం చేయించడం ఇవన్నీ బీజేపీ సినిమా గ్లామర్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ సారథ్యలోని జనసేనతో ఎనిమిదేళ్లుగా బీజేపీ పొత్తు కొనసాగిస్తోంది. అయితే తాజాగా బీజేపీ, జననేస మధ్య గ్యాప్ ఏర్పడింది.
Also Read: America- India: మినీ ఇండియాగా మారుతున్న అమెరికా.. అగ్రరాజ్యాన్ని ఆక్రమిస్తున్న భారతీయులు!
అందుకే జూనియర్ ఎన్టీఆర్, నితిన్‌తో సమావేశాలు..
జనసేన పార్టీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న బీజేపీ పవన్ కళ్యాణ్ తమకు దూరమైతే సినీమా స్టార్స్ పపోర్టు తగ్గుతుందని భావించిన కమలనాథులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరు కాగా, బీజేపీ చిరంజీవిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. పవన్‌కళ్యాణ్ సోదరుడితోనే మోదీ సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్‌కు ప్రత్యామ్నాయంగా జూనియర్ ఎన్టీఆర్‌ను భావించి ఆయనతో హోంమంత్రి అమిత్‌షా సమావేశమయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన నచ్చి అమిత్‌షా స్వయంగా తనను కలవాలని పిలిచినట్లు ప్రచారం జరిగినా దాని వేనుక రాజకీయ ఉద్దేశం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. ఇక ఇటీవల బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర 3వ విడత ముగింపు సభకు హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో ఒక సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే నటుడు నితిన్‌తో సమావేశం అయ్యారు. అంతకముందు ఉమెన్ క్రికెటర్ మిథాలీరాజ్‌తోనూ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నితిన్, మిథాలీరాజ్ బీజేపీకి ప్రచారం చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటిచారు. మొత్తంగా ఈ సమావేశాలన్నీ బీజేపీకి పవన్ దూరమైతే తమకు ఉపయోగపడతాయని, పవన్ తమతో ఉన్నా వీరు అదనపు బలంగా మారతారని కషాయ నేతలు భావిస్తున్నారు.

పవన్‌లోనూ కమలనాథులపై అసంతృప్తి..
ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ నేతలపై అసంతృప్తితోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న పవన్‌కు బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. రోడ్ల మరమ్మతు, కౌలు రైతుల విషయంలో జనసేనాని ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. అదే సమయలో బీజేపీ వైసీపీ ప్రభుత్వంతో స్నేహంగానే ఉంటుంది. ఈ పరిణామం పవన్‌కు నచ్చడం లేదు. మరోవైపు బీజేపీలో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరితో కొనసాగాలనే విషయంలో ఆ పార్టీ అధిష్టానం తేల్చుకోవడం లేదు. జనసేన తన మిత్రపక్షం అని చెబుతూనే వైసీపీ సర్కార్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో పవన్‌కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు యత్నించడ బీజేపీకి నచ్చడం లేదు. మరోవైపు వైసీపీతో బీజేపీ సత్సంబంధాలు కొనసాగించడం జనసేనానికి నచ్చడం లేదు. వైసీపీని ఓడించాలని జన సేనానిలో ఉన్న కసి బీజేపీలో కనిపించడం లేదు. ఈ నేపథ్యలో బీజేపీ, జసనేస మధ్య గ్యాప్ ఏర్పడింది.
టీడీపీ ఓటర్లను బీజేపీవైపు తిప్పుకునే ప్రయత్నం..
ఆంధ్రప్రదేశలో టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న బీజేపీ నందమూరి వారసులను చేరదీయడం ద్వారా టీడీపీ సానుకూల ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని చూస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఎన్టీఆర్ అనుభవాలను పునికి పుచ్చుకున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో పురంధేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్‌ను ముందు ఉంచడం ద్వారా తమకు లబ్ధి కలుగుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇదే సమయంలో తాము జనసేనతో స్నేహం కొనసాగిస్తూ సెకండరీ పార్టీగా ఉండాని భావించడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి తమదే కీలక పాత్ర కావాలని అనుకుంటోంది. ఇదే సమయంలో జనేసేనాని మాత్రం తమ కూటమిలో బీజేపీ సెకండరీ పాత్రకే పరిమితం కావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు పట్టుపడుతున్నారు. బీజేపీ ద్వారా ప్రకటనకు ఒత్తిడి చేశారు. ఈ విషయం బీజేపీకి నచ్చలేదు. ఈ క్రమంలోనే పవన్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర తెలుగు స్టార్స్‌తో సన్నిహితంగా మెలుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read:CM KCR Bihar Tour: బిహార్ లో కేసీఆర్ లుక్ చూసి అందరు షాక్
[…] […]