Liger Collections: లైగర్ ఎక్స్ క్లూజివ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్స్ ఆఫీస్ దగ్గర కనీస వసూళ్లను కూడా రాబట్టలేక ఎదురీదుతోంది. మొత్తానికి బయ్యర్లను అడ్డంగా ముంచింది. కొన్ని ఏరియాల్లో అయితే, థియేటర్ రెంట్ డబ్బులు కూడా వెనక్కి రావడం లేదు. భారతీయ సినీ చరిత్రలోనే భారీ నష్టాలను మిగిల్చిన సినిమాగా, ఈ లైగర్ చిత్రం చరిత్ర పుటల్లోకి సగర్వంగా ఎక్కింది. నిజానికి, ఈ రికార్డు మొన్నటి వరకూ మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ పేరిట ఉండేది. కానీ, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు డిజాస్టర్ రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తమ్మీద ఎవ్వరూ ఊహించని విధంగా లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అసలు ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. అదేమిటో విచిత్రంగా ఓపెనింగ్స్ కూడా అంత గొప్పగా ఏం రాలేదు.

అయితే, వినాయక చవితి హాలీ డే లైగర్ కి బాగా కలిసి వస్తుంది అనుకున్నారు. కానీ.. చవితి నాడు కలెక్షన్స్ కూడా అస్సలు బాగాలేదు. పండగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ లైగర్ మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేకపోవడం ఆశ్చర్యకరం. నిన్న, 6వ రోజు కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షలు మాత్రమే రాబట్టింది. హిందీలో కూడా 3 లక్షలు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి హిందీలో సరైన సినిమా లేకపోయినప్పటికీ.. హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పూర్తిగా చేతులు ఎత్తేసింది.
Also Read: Pawan kalyan- Bandla Ganesh: పవన్ ఫ్యాన్స్ కి భక్తుడు బండ్ల గణేష్ విన్నపం… ఆలకించి ఆదరిస్తారా?
దీనికి తోడు హీరో విక్రమ్ కోబ్రా సినిమా లైగర్ కలెక్షన్స్ పై గట్టి దెబ్బ కొట్టింది. దాంతో రేపటి నుంచి లైగర్ సినిమాకి షేర్ వస్తుందో లేదో అన్న డౌట్ కూడా ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. నష్టాల వలయంలో పూర్తిగా చిక్కుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు విజయ్ దేవరకొండ షాక్ లోకి వెళ్ళిపోయాడు. మరి ఈ సినిమాకి 7వ రోజు వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
7 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం 5.86 కోట్లు
సీడెడ్ 1.92 కోట్లు
ఉత్తరాంధ్ర 1.83 కోట్లు
ఈస్ట్ 0.97 కోట్లు
వెస్ట్ 0.98 కోట్లు
గుంటూరు 1.07 కోట్లు
కృష్ణా 0.91 కోట్లు
నెల్లూరు 0.72 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 7 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 14.27 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 28.54 కోట్లు వచ్చాయి.

తమిళనాడు 0.39 కోట్లు
కేరళ 0.44 కోట్లు
కర్ణాటక 0.99 కోట్లు
హిందీ 6.57 కోట్లు
ఓవర్సీస్ 3.41 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 7 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 26.08 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 52:17 కోట్లను కొల్లగొట్టింది
లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ 55 కోట్లు జరిగింది. కానీ, 7 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ లెక్కలను బట్టి నష్టాలను అంచనా వేస్తే.. ఈ సినిమాకి 37 కోట్ల వరకు భారీ నష్టాలు రానున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. మరోవైపు లైగర్ ప్లాప్ పరాభవాన్ని ప్రేక్షకులు త్వరగా మర్చిపోవడానికి విజయ్ దేవరకొండ టీమ్ కొత్త ఐడియాలు ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఫేక్ కలెక్షన్స్ ను పెట్టి.. సోషల్ మీడియాలో భారీ కలెక్షన్స్ అంటూ పెయిడ్ ప్రమోషన్స్ చేయిస్తున్నారు. ముఖ్యంగా హిందీలో ఈ తరహా ప్రమోషన్స్ మరి ఎక్కువగా ఉన్నాయి. అయినా లేని కలెక్షన్స్ ను ఉన్నాయని చూపించే బదులు… ముందు నుంచే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఆలోచించు విజయ్.
Also Read:Chandrababu- NDA: చంద్రబాబు ఎన్డీయేలో చేరతాడా ? అసలు ప్లాన్ ఏంటి?
[…] Also Read: Liger Collections: లైగర్ కలెక్షన్స్ తో మోహన్ బాబ… […]
[…] Also Read:Liger Collections: లైగర్ కలెక్షన్స్ తో మోహన్ బాబ… […]