
గత పదేళ్లకాలానికి ప్రస్తుత కాలానికి ఎంతో తేడా కనిపిస్తోంది. భారత దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతానని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మెల్లిమెల్లిగా అన్ని రంగాలను ప్రయివేటు పరం చేస్తోంది. గతంలో కన్నా.. ప్రస్తుత ఏడాది కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది కమలం ప్రభుత్వం. ఇవి ప్రజలకు ఇబ్బందిగా మారాయి. పెరుగుతున్న ధరలు.. రైతు వ్యతిరేక చట్టాలు.. బీజేపీకి గడ్డు పరిస్థితి తీసుకొచ్చాయని చెప్పకోవచ్చు. ఈ నేపథ్యంలో నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. గెలుపుపై కేంద్ర సర్కారు ధీమాగా ఉన్నా.. సర్వేలు.. కొంత భయపెడుతున్నాయి.
Also Read: కమల్ థర్డ్ ఫ్రంట్.. సీఎం అభ్యర్థి ఆయనే..
నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల ఏడో తేదీన నోటిఫికేషన్ వస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చినా.. అది విపక్షాలను తప్పుదోవ పట్టించడానికే అని తేలిపోయింది. అయితే సాధారణంగా ఎన్నికలు జరిగే ముందు కొన్ని మీడియా సంస్థలు రెండు మూడు నెలల పాటు సర్వేల పేరిట హడావుడి చేస్తాయి. ఈ సారి ఎన్నికల షెడ్యూలు వచ్చే వరకు ప్రముఖ మీడియా సంస్థలు ఎలాంటి సర్వే ఫలితాలను ప్రకటించలేదు.
Also Read: ఇండియాలో సెకండ్ వేవ్ మొదలైందా..? కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
సాధారణ ఎన్నికలైనా.. ఇతర రాష్ర్టాల ఎన్నికలయినా.. జాతీయస్థాయిలోని మీడియా సంస్థలన్నీ.. ఇతర పోల్ సంస్థలతో కలిసి సర్వేలు చేసి.. ప్రజలమీదకు వదిలేవి. అవి నిజమవుతాయో.. లేదో కానీ.. ప్రజలు ఓ అంచనాకు రావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ఈ సారి మాత్రం ఇలాంటి సర్వేలు నిర్వహించలేదు. ఇప్పటి వరకు విడుదల చేయలేదు. నోటిఫికేషన్ సైతం వచ్చేసింది కాబట్టి చివరి దశ పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్ ప్రకటించుకోవచ్చు. కానీ సర్వేలు ప్రకటించడానికి వీలు లేదు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
అసలు ఎందుకు ఇప్పుడు మీడియా సంస్థలు సర్వేలు చేయలేదనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి గడ్డు పరిస్థితి ఉందని.. ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావు కాబట్టి.. సర్వేలు చేయలేదనేది సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అసోంలో అధికార వ్యతిరేకత ఇబ్బందిగా మారింది. బెంగాల్ లో పుంజుకున్నా.. అదికారం అందుకుంటారని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఇక పుదుచ్చెరి, కేరళ, తమిళనాడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో బీజేపీకి పాజిటివ్ ఫలితాలు రావు కాబట్టి.. సర్వేలను మీడియా సంస్థలు అన్ని లైట్ గా తీసుకున్నాయిఅని ప్రజలు అంటున్నారు.