“చాలా ఎత్తుకు ఎప్పుడు ఎదుగుతాం?

అంటే బాగా డబ్బులు సంపాదించే ఎత్తుకు అనా? బాగా అధికారం ఉన్న ఎత్తుకు అనా? గొప్ప రాజకీయ నాయకుడయ్యెడనా ? గొప్ప పారిశ్రామికవేత్త అయ్యాడనా? ఇంకా ఇంకా ఇలాంటివన్నీ అనా? ఉపాధ్యాయ వృత్తి వీటన్నింటికంటే కూడా గొప్పది. మనం ఎన్నోసార్లు విన్నాం , చెప్పాం. ఒక కలక్టర్ ను ఒక డాక్టర్ ను ఒక శాస్త్రవేత్తను ఒక ముఖ్యమంత్రిని ఒక ప్రధాన మంత్రిని , ఉపాధ్యాయుడే తీర్చిదిద్దుతాడు కాని ఈ వ్రుత్తిలోని ఏ ఒక్కరుగూడా ఒక ఉపాధ్యాయున్ని […]

Written By: NARESH, Updated On : February 28, 2021 11:05 am
Follow us on

అంటే బాగా డబ్బులు సంపాదించే ఎత్తుకు అనా? బాగా అధికారం ఉన్న ఎత్తుకు అనా? గొప్ప రాజకీయ నాయకుడయ్యెడనా ? గొప్ప పారిశ్రామికవేత్త అయ్యాడనా? ఇంకా ఇంకా ఇలాంటివన్నీ అనా?

ఉపాధ్యాయ వృత్తి వీటన్నింటికంటే కూడా గొప్పది. మనం ఎన్నోసార్లు విన్నాం , చెప్పాం. ఒక కలక్టర్ ను ఒక డాక్టర్ ను ఒక శాస్త్రవేత్తను ఒక ముఖ్యమంత్రిని ఒక ప్రధాన మంత్రిని , ఉపాధ్యాయుడే తీర్చిదిద్దుతాడు కాని ఈ వ్రుత్తిలోని ఏ ఒక్కరుగూడా ఒక ఉపాధ్యాయున్ని తయారు చేయలేరు.

నేను చాలా ఎత్తుకు ఎదిగాను నీవు నాంత ఎత్తుకు ఎందుకు ఎదుగలేకపోయావని అడుగడం, అన్నది , ఆ ప్రశ్న అడిగిన ఆ విద్యార్థి ఎంత అహంకారి కాకపోతే తనను ఆ స్తాయికి ఎదిగించిన గురువుముందే నీవు నా స్తాయికి ఎందుకు చేరుకోలేకపోయావని ప్రశ్నిస్తాడు? అలా గురువును ప్రశ్నించిన ఆ విద్యార్థి నిజమైన విలువల ఎత్తుకు ఎదిగినట్లేనా?

ఇకడ చర్చకోసం చూద్దాం, ఒక విత్తనం తాను పట్టున పలిగి ప్రాణం విడిచి మొలకకు ప్రాణం పోస్తుంది. ఆ మొలుక పెర్గి పెద్దగై పుష్పించి ఫలించి ఫలాన్ని ఇస్తుంది. కొండొకచోట మొక్క శిథిలమైపోయి ( మక్క, పెసర, కంది లాంటివి) ఫలాన్ని ఇస్తాయి. ఆ మక్క కంకి , ఆ పెసరు కాయ తనకు జన్మనిచ్చిన , ఎదుగడానికి ఊతమిచ్చిన విత్తనాన్ని , మొక్కను పట్టుకొని నీవు నా అంత హితకారినివి కాలేకపోయావని ఎద్దేవాజేస్తే అర్థం ఉంటుందా? గింజలేకపోయినా మొక్కలేకపోయినా ఆ ఫలానికి ఉనికి ఎక్కడ? ఇది ప్రతిఫలాపేక్షలేని ప్రకృతి విషయం . కాని మనుషులు అలా కాదు . ఆయన సంపద, ఆయన అధికారం, ఆయన గొప్పదనం ఏదైనా తనకూ తనవారికీ తప్ప పరులకు అంత హితమైనది కాకపోవచ్చు కూడా.

కనుక తన కోసం , తనవారికోసం తాను ఎదిగిన గొప్పదనం ఏదైతే ఉందో వాస్తవానికి స్వార్థపూరితమైందే. అయినప్పటికీ ఆయన ఎదుగుదలకు అతని తలిదండ్రులతో బాటుగా తోబుట్టువులు, తన వాడ, ఊరు, తనచుట్టూ ఉన్న సమస్త చరా చర వస్తువులు , ప్రాణులు అందరూ కారణమే . ఆ సృహతో ఆ రుణం తీర్చుకునే కృషిలో ఉన్నవాడు ఎదిగినట్లు. కానీ అదంతా నా ప్రయోజక్త్వమే అనుకుంటే వానంత అహంకారి మరొకరు ఉండబోరు.

-వీరగోని పెంటయ్య