https://oktelugu.com/

‘సాగర్’లో ‘బండి’కి బ్రేకులేనా..?

కొద్దికాలంగా బీజేపీ రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. యవ నాయకత్వంలో కమలం ‘బండి’ జోరుగా ముందుకు సాగుతోంది. అయితే ఈ ఊపు ప్రస్తుతం పార్టీని చిక్కుల్లో పడేస్తోంది. నాగార్జున సాగర్లో పోటీ చేసేది తామంటే తామని.. పోటీ పడుతుండడంతో గతంలోని కాంగ్రెస్ పార్టీ తీరు ఇప్పుడు బీజేపీలో కనిపిస్తోంది. నిజానికి బీజేపీకి బలమైన అభ్యర్థి సాగర్లో లేరు. ఇతర పార్టీల నుంచి వచ్చే గట్టినాయకుడిపై బీజేపీ కన్నేసింది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ చివరి క్షణం వరకు అభ్యర్థి కోసం […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 28, 2021 11:31 am
    Follow us on

    Bandi Sanjay
    కొద్దికాలంగా బీజేపీ రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. యవ నాయకత్వంలో కమలం ‘బండి’ జోరుగా ముందుకు సాగుతోంది. అయితే ఈ ఊపు ప్రస్తుతం పార్టీని చిక్కుల్లో పడేస్తోంది. నాగార్జున సాగర్లో పోటీ చేసేది తామంటే తామని.. పోటీ పడుతుండడంతో గతంలోని కాంగ్రెస్ పార్టీ తీరు ఇప్పుడు బీజేపీలో కనిపిస్తోంది. నిజానికి బీజేపీకి బలమైన అభ్యర్థి సాగర్లో లేరు. ఇతర పార్టీల నుంచి వచ్చే గట్టినాయకుడిపై బీజేపీ కన్నేసింది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ చివరి క్షణం వరకు అభ్యర్థి కోసం ఎలా ఎదురుచూసిందో.. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతే.

    Also Read: బీజేపీకి టార్గెట్ ఫిక్స్ చేసిన కేటీఆర్..

    దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థలు టికెట్లకోసం ఎలా పోటీ పడ్డారో.. సాగర్లో బీజేపీ పరిస్థితి అదే విధంగా తయారైంది. చివరికి బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి ముందు కూడా నేతలు టికెట్టు కోసం పోటీపడ్డారు. దాంతో బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని.. ఎవరూ లైన్ దాటరని అనుకున్న ఆయన పరిస్థితి తేడాగా ఉందని.. చూసుకోమ్మని బండి సంజయ్ కి చెప్పి వెళ్లిపోయారు. ఏ క్షణమైనా సాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో దూసుకెళ్లాలని అనుకుంటున్నారు.

    Also Read: లాయర్ దంపతులది ప్రభుత్వ హత్య: వామన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్

    దీంతో అభ్యర్థిని ఖరారు చేసేందుకు నాగార్జునసాగర్ లో సమీక్ష సమావేశం పెట్టారు. కనీసం పదిమంది నేతలు టికెట్ కోసం పోటీ పడడం.. ఎవరికి వరు ప్రచారం చేసుకుంటున్న వైనం అగ్రనేతలకు కోపం తెప్పించింది. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని … పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే.. వారికోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లగొండ నేతలకు సూచించి హైదరాబాద్ వెళ్లిపోయారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    అయితే కాంగ్రెస్లో ఉన్నట్లుగా అంతర్గత ప్రజాస్వామ్యం బీజేపీలోనూ ఎక్కువ అవుతోందని వస్తున్న సెటైర్లకు బండి సంజయ్ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. గెలిచేది తామే కాబట్టి.. తమ పార్టీలో టికెట్లకోసం పోటీ ఎక్కువగా ఉంటుందని.. టికెట్ తమకే రావాలని నాయకులు కోరడంలో తప్పులేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి సాగర్ లో బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రెండు వేలకు కాస్త తక్కువ. ఈ సారి పోటీ మాత్రం చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మరో వైపు తమ పోటీ కాంగ్రెస్ తోనని టీఆర్ఎస్ చెప్పుకొస్తుంది.