Maharashtra Election results 2024 : దేశంలో రెండు నెలలుగా ఆసక్తి రేపుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20 ముగిసింది. దీంతో నవంబర్ 23న ఈసీ కౌంటింగ్ చేపట్టింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలో 11 గంటల వరకు రానున్నాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది.
మహారాష్ట్రలో మహాయుతి.. జార్ఖండ్‌లో హంగ్..
ఇక మహారాష్ట్రలో బీజేపీ కూటమి నేతృత్వంలోని మహాయుతి కూటమి జోరు కొనసాగిస్తోంది. కూటమిలోని బీజేపీ 116 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. శివసేన(షిండే) పార్టీ 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్‌సీపీ(అజిత్‌పవార్) 33 స్థానాల్లో అధిక్యంలో ఉంది. కూటమి మొత్తంగా 210 స్థానాలో అధిక్యం కనబరుస్తోంది. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ 103 స్థానాలు గెలవగా, ఈసారి 116 స్థానాల్లో అధిక్యంలో ఉంది. దీంతో సీఎం బీజేపీ నేత అవుతారన్న చర్చ కూడా జరుగుతోంది. షిండే సీఎం పీటం వదులుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జార్ఖండ్‌లో మాత్రం హోరాహోరీగా పోరు సాగుతోంది. ఇక్కడ హంగ్ ప్రభుత్వం తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ఇక్కడ బీజేపీ కేవలం 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్, జేఎంఎం కూటమి 52 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అయితే లీడింగ్ గంట గంటకు, రౌండ్ రౌండ్‌కు మారుతోంది. హరియాణ తరహాలో మారతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హంగ్ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మహారాష్ట్రలో పవనిజం..
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం కలిసి వచ్చింది. ఆయన మహారాష్ట్రలోని పూణె, బల్లార్‌పూర్, లాతూర్, డెంగ్లూర్, షోలాపూర్‌లో పవన్ ఎన్నికల ప్రచారం చేశారు. సినిమా హీరోగా ఆయనను అక్కడి ప్రజలు విశ్వసించారని తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన సతానత ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ సనాతన ధర్మాన్ని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. దీంతో ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ప్రనస్తుతం బీజేపీ లీడింగ్‌లో ఉంది. దీంతో మహారాష్ట్రలోనూ పవన్ 100 శాతం స్ట్రైక్‌రేట్ సాధించినట్ల ప్రచారం జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయగా 20 సీట్లలోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే.