Telangana BJP: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై శాసనసభలో ప్రకటన చేసి నిరుద్యోగులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కొద్ది రోజులుగా బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలని భావించి కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావించారు. దీన్ని బీజేపీ టార్గెట్ చేసుకుంది. ఈ మేరకు నిరుద్యోగుల ఉద్యోగాల ఆశలు నెరవేరాలంటే వారికి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి నియోజకవర్గాల వారీగా కోచింగ్ అందజేయాలని సూచిస్తూ కేసీఆర్ కు లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. వారికి టిఫిన్లు, భోజనాలు కూడా అందించి వారి కలలు నెరవేరేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు బీజేపీ సంకల్పించింది. ఇందులో భాగంగానే స్టడీ సర్కిళ్ల ప్రతిపాదన తీసుకొచ్చి నిరుద్యోగులకు దగ్గరవ్వాలని భావిస్తోంది. తెలంగాణ సర్కారు చేసిన ప్రకటనకు కౌంటర్ గానే బండి సంజయ్ ఈ మేరకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టాలని చేస్తున్న యత్నాలను అడ్డుకునేందుకు బీజేపీ కూడా తగు విధంగా ప్రణాళికలు రచిస్తోంది. నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ వారికి అనుకూలంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం ఇందులో ఒక భాగమే అని చెబుతున్నారు .
Also Read: పవన్ కళ్యాణ్ మీటింగ్ తో వైసీపీలో టెన్షన్!
రాష్ర్టంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ టీఆర్ఎస్ నిర్ణయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. అందుకగుణంగానే వ్యూహాలకు పదును పెడుతోంది. టీఆర్ఎస్ ను ఎదర్కొనేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఏది చేసినా అందులో మంచిని తమ వైపు తిప్పుకోవాలనే బీజేపీ ఊహిస్తోంది. అందుకే టీఆర్ఎస్ ఉద్యోగాల కల్పనపై ప్రకటన చేయగానే నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లేఖ రాని వారి మన్ననలను పొందాలని ఆశిస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్న దానికి ప్రతిఫలంగా ఎలా లాభం పొందాలనే దానిపై బీజేపీ కూడా అప్రమత్తంగానే ఉంటోంది. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలతో దూకుడు మీదున్న పార్టీ 2024లో కూడా అధికారమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా అధికారం మీద ఆశలు పెట్టుకుంది. గోవాలో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తరువాత తెలంగాణపైనే దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమనే అభిప్రాయం బీజేపీ నేతల్లో వస్తోంది.
Also Read: జనసేనకు ఊపు.. ఆవిర్భావ వేడుక వేళ పెద్ద ఎత్తున నేతల చేరిక