Raghul Gandhi: దేశంలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోవడం గమనార్హం. దీంతో పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్వాతంత్ర్యం నుంచి దేశంలో సమర్థవంతమైన పాలన అందించిన పార్టీగా వినుతికెక్కినా ప్రస్తుతం చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా తయారయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో కనీసం రెండో స్థానంలో కూడా నిలవేలకపోయింది. సమాజ్ వాదీ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకోగా కాంగ్రెస పార్టీ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించి పరువు కోల్పోయింది.
ఓటమికి గల కారణాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించనుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనుంది. ఇందులో పార్టీ అయిదు రాష్ట్రాల్లో ఘోర పరాభవంపై పోస్టుమార్టమ్ నిర్వహించనుంది. మరోవైపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తమ పదవులకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇది కొత్తేమీ కాదు గతంలో కూడా పలుమార్లు వారు రాజీనామా చేస్తామని చెప్పడం నేతలు వారించడం తెలిసిందే. ఈ సారి కూడా వారి రాజీనామా వ్యవహారం హల్ చల్ చేస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్ మీటింగ్ తో వైసీపీలో టెన్షన్!
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలుగా గుర్తింపు పొందిన జీ-23 నేతలు గాంధీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకే వారికి అవకాశం ఇవ్వకుండా ముందే రాజీనామా చేయాలని గాంధీలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆజాద్ ఇంట్లో పార్టీ వ్యతిరేక వర్గం సమావేశం అయినట్లు చెబుతున్నారు. దీనిపై గాంధీల రాజీనామాలను పార్టీలోని నేతలు తిరస్కరించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పరాజయం వెనుక కారణాలను అన్వేషించేందుకు పార్టీ సిద్ధమైనట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలేంటి? ఘోర పరాభవానికి ప్రతికూల అంశాలేంటి? పార్టీ ఎదుగుదల ఎలా అవుతుంది? అనే వాటిపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సమాయత్తమవుతున్నారు. అయిదు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో దేశంలో నానాటికి పరిస్థితి దిగజారిపోతోంది. దీంతో దీన్ని అడ్డుకోవడానికి ఏ కార్యాచరణ ప్రణాళిక అవలంభించాలనే దానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. పార్టీలో ప్రక్షాళన తప్పనిసరి అని తేలిపోయింది.
భవిష్యత్ పరిణామాల కోసం పార్టీని ముందుకు నడిపించగల నాయకత్వం గురించి అన్వేషించే అవకాశం ఉంది. ఇన్నాళ్లు పార్టీ ఓటమి పరంపర కొనసాగుతుండటంతో ఇక దానికి అడ్డుకట్ట వేసేందుకు మార్గాలను అన్వేషించనున్నట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచించనున్నట్లు సమాచారం. దేశంలో పార్టీ పరిస్థితి రోజురోజుకు కిందికే పోవడంతో పైకి తీసుకురావడమెలా అనేదానిపై నేతలు ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: జనసేనకు ఊపు.. ఆవిర్భావ వేడుక వేళ పెద్ద ఎత్తున నేతల చేరిక