ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలు ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి (జూలై 24) ఈ యాత్ర ప్రారంభించబోతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, మరికొంత మంది నేతలు ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. ఈ యాత్రలో భాగంగా వీరు తొలుత విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించనున్నారు.
అయితే.. ఈ యాత్రను గతంలోనే చేపట్టాలని భావించారు. ‘కపిల తీర్థం టూ రామతీర్థం’ వరకు రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆ మధ్య ఏపీలో దాడులు జరిగిన ఆలయాలను కూడా కలుపుతూ యాత్రకు ప్లాన్ చేశారు. ఈ యాత్రలోనే పలు చోట్ల జన జాగృతి సభలను నిర్వహించాలని కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కానీ.. స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఈ యాత్రను నిలిపేశారు.
పంచాయితీ ఎన్నికల తర్వాతైనా ఈ యాత్ర చేపట్టాలని భావిస్తే.. ఆ వెంటనే మునిసిపల్ ఎన్నికలు వచ్చాయి. అనంతరం పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత తిరుపతి ఉప ఎన్నిక.. ఇలా వరుసగా ఎలక్షన్ సీజన్ రావడంతో.. ఈ యాత్ర నిరవధికంగా వాయిదా పడింది.
ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉండడంతో.. ఈ యాత్రకు సిద్ధమవుతోంది ఏపీ బీజేపీ. ఈ యాత్రలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సోమూవీర్రాజు నాయకత్వంలో ఏపీలో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఈ యాత్ర ద్వారా ఆ వైపు అడుగులు వేయాలని చూస్తోంది. మరి, ఈ యాత్ర ఎంత వరకు ఆ పార్టీకి మేలు చేకూరుస్తుందన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bjp going to start temple tour in andhra pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com