https://oktelugu.com/

ముందు చంద్రబాబు స్థానం, ఆ తరువాత సీఎం పీఠం..!

బలహీనంగా ఉన్నప్పుడు శత్రువు కొట్టే చిన్న దెబ్బ కూడా గట్టిగా తగులుతుంది. దాని నుండి కోలుకోవడం కష్టం అవుతుంది. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. ఓ ప్రక్క జగన్ దూకుడు నిర్ణయాలతో ముప్పతిప్పలు పెడుతుంటే మరో ప్రక్క బీజేపీ-జనసేన కూటమి దాడి ఇబ్బంది పెడుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు మొదటి టార్గెట్ చంద్రబాబుగా కనిపిస్తుంది. అధికార పక్షం కంటే కూడా ఆయన ఎక్కువగా బాబునే టార్గెట్ చేస్తున్నారు. అమరావతి విషయంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 6, 2020 / 01:37 PM IST
    Follow us on


    బలహీనంగా ఉన్నప్పుడు శత్రువు కొట్టే చిన్న దెబ్బ కూడా గట్టిగా తగులుతుంది. దాని నుండి కోలుకోవడం కష్టం అవుతుంది. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. ఓ ప్రక్క జగన్ దూకుడు నిర్ణయాలతో ముప్పతిప్పలు పెడుతుంటే మరో ప్రక్క బీజేపీ-జనసేన కూటమి దాడి ఇబ్బంది పెడుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు మొదటి టార్గెట్ చంద్రబాబుగా కనిపిస్తుంది. అధికార పక్షం కంటే కూడా ఆయన ఎక్కువగా బాబునే టార్గెట్ చేస్తున్నారు. అమరావతి విషయంలో తోడుగా ఉంటారనుకుంటే, మాకేమి సంబంధం లేదని పక్కకు తప్పుకున్నారు. బీజేపీ వ్యూహం కూడా ముందు బాబును బలహీనపరచడమే అనిపిస్తుంది.

    ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని బలహీనపరిచి ఆ స్థానంలోకి బీజేపీ-జనసేన కూటమి చేరాలని ఆశపడుతోంది. క్షేత్ర స్థాయిలో టీడీపీ మరుగునపడేలా చేయాలన్నది వారి వ్యూహం. అమరావతి ఉద్యమంతో బాబు రెండు ప్రాంతాల ప్రజలకు దూరం అయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది. ఈ రెండు ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు ఈ అంశంపై నోరుమెదపడం లేదు. కొందరైతే జగన్ కి మద్దతు పలుకుతున్నారు. గత ఎన్నికలలో ఎదురైన ఘోర ఓటమి తరువాత 23సీట్లతో కుదేలైన టీడీపీ ప్రభావం ఏపీలో తగ్గించడం అంత కష్టమైన పనేమీ కాదు. అలాగే దానికి ఇది అదునైన సమయంగా బీజేపీ పార్టీ భావిస్తుంది.

    తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ క్యాడర్ మొత్తం గులాబీ దళంలో చేరింది. అతి తక్కువ శాతం కాంగ్రెస్, బీజేపీ లకు వచ్చి చేరింది. ప్రజలు ఎప్పుడు ఓ బలమైన పార్టీకి మరో బలమైన ప్రత్యామ్నాయం కోరుకుంటారు. టీడీపీ పార్టీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిన నేపథ్యంలో ఆ పార్టీ క్యాడర్ బీజేపీ-జనసేన కూటమి వైపు మొగ్గు చూపే ఆస్కారం లేకపోలేదు. ఏపీలో వైసీపీ అంత బలమైన పార్టీగా ఎదగడానికి టీడీపీ వ్యతిరేకులు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు జగన్ కి మద్దతు తెలపడమే. అందుకే బీజేపీ మొదట బాబు ప్రతిపక్ష స్థానానికి ఎసరుపెట్టి, ఆ హోదా దక్కించుకోవాలని చూస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో జగన్ మేనియాతో మరలా అధికారంలోకి వచ్చినా, భవిష్యత్తులో ఈ కూటమి సీఎం పీఠం ఎక్కే అవకాశం ఉంటుంది. అందుకే టార్గెట్ టీడీపీగా బీజేపీ రాజకీయం సాగుతుందనిపిస్తుంది.