https://oktelugu.com/

భార్య బాధితుడిగా రవితేజ !

టాలీవుడ్ లో స్పీడ్ గా సినిమాలు చేసే హీరోల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ మాస్ మహరాజా రవితేజదే. గత ఏడేళ్ల నుండి మంచి సాలిడ్ హిట్ లేకపోయినా వరుస సినిమాలను అంగీకరిస్తూ తన స్పీడ్ ను మాత్రం రవితేజ ఎక్కడా తగ్గించడం లేదు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఫుల్ కామెడీ […]

Written By:
  • admin
  • , Updated On : August 6, 2020 / 02:10 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో స్పీడ్ గా సినిమాలు చేసే హీరోల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ మాస్ మహరాజా రవితేజదే. గత ఏడేళ్ల నుండి మంచి సాలిడ్ హిట్ లేకపోయినా వరుస సినిమాలను అంగీకరిస్తూ తన స్పీడ్ ను మాత్రం రవితేజ ఎక్కడా తగ్గించడం లేదు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రానుందని, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉండబోతుందని.. ఒక విధంగా రాజేంద్రప్రసాద్ పాత సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా ఉండబోతున్న విషయం తెలిసిందే.

    Also Read: ఇండస్ట్రీలో ఉప్మా యవ్వారాల పై కరోనా చెక్ !

    అయితే తాజాగా ఈ సినిమా బృందంలోని సభ్యుడి సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ భార్యా బాధితుడిగా కనిపించబోతున్నాడట. మన చట్టాల్లోని స్త్రీలకు అనుగుణంగా ఉన్న చట్టాలతో రవితేజ పాత్ర ఎన్ని ఇబ్బందులు పడిందో ఫుల్ కామెడీగా చూపించబోతున్నారని తెలుస్తోంది. అయితే చివర్లో మగాళ్లకు సంబంధించి ఫేవర్ గా ఒక మెసేజ్ తో సినిమా ముగుస్తుందట. అలాగే మన చట్టాల్లోని లొసుగులను బాగానే ఎలివేట్ చేస్తూ.. కొన్ని పేరడీ ట్రాక్ లు కూడా ఉన్నాయని సమాచారం. ఇక కరోనా రాకపోయి ఉంటే… ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేసుకునేది.

    Also Read: బిగ్ బాస్ హౌస్ లో.. మసాలా లవ్ డ్రామాలు!

    ఏమైనా రవితేజ భార్య బాధితుడిగా అదీ ఫుల్ కామెడీతో అంటే సినిమా పై బాగానే ఆసక్తి క్రియేట్ అవుతుంది. పైగా ఈ మధ్య రవితేజ నుండి ఇలాంటి కామెడీ రాలేదు. ఏది ఏమైనా ఈ సారి రవితేజ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించబోతున్నాడు. ఎలాగూ త్రినాథరావ్ నక్కిన కామెడీని బాగా హ్యాండిల్ చేస్తారు. ఆయన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి కామెడి సినిమాల్లో గుడ్ ఎంటెర్టైమెంట్ ఉంది. ఆ రకంగా ఇప్పుడు రవితేజతో చేయబోయే సినిమాలోనూ గుడ్ కామెడీ ఉండటం ఖాయం. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు.