Homeజాతీయ వార్తలుBJP Election Strategies: ఉత్తరప్రదేశ్, గుజరాత్ స్టేట్లలో పరువు నిలుపుకోవాలని బీజేపీ పాట్లు

BJP Election Strategies: ఉత్తరప్రదేశ్, గుజరాత్ స్టేట్లలో పరువు నిలుపుకోవాలని బీజేపీ పాట్లు

BJP Election Strategies: BJP Plans For Uttar Pradesh and Gujarat states

BJP Election Strategies: దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. త్వరలో జరగబోయే ఐదు స్టేట్ల ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న పార్టీలు తమ వైఖరులు వెల్లడిస్తున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్, గుజరాత్ లలో అధికారం కోసం బీజేపీ తాపత్రయ పడుతోంది. ఇవి రెండు పెద్ద స్టేట్లు కావడంతో ఇక్కడే ఎక్కువ సీట్లు ఉండడంతో పార్టీలు కూడా వీటిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టింది. మూడోసారి కూడా ఇదే విధంగా చేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది.

ఉత్తరప్రదేశ్ లో మాత్రం బీజేపీలో అంతర్గత కలహాలు భయపెడుతున్నాయి. సీఎం యోగి ఆతిత్యనాథ్ పై ఉన్న వ్యతిరేకతతోనే పార్టీకి నష్టం జరిగే సూచనలున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. లోపాలు సరిదిద్దుదామనుకున్నా ఇప్పటికే ఆలస్యమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి అనుకూలమైన అంశమేమిటంటే అయోధ్య రామమందిర నిర్మాణం ఒక్కటే అని చెప్పాలి. యోగిపై వ్యతిరేకత మాత్రం తీవ్ర స్థాయిలో ఉందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో బీజేపీ ఇక్కడ నుంచి అధిక స్థానాలు గెలుచుకోవలని చూస్తుండడం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సిందే.

ఇక గుజరాత్ పరిస్థితి కూడా డోలాయమానంలో పడిపోయింది. ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ రూపానీని మార్చినా పార్టీ గట్టెక్కుతుందో లేదో అనే అనుమానాలే అందరిలో వ్యక్తం అవుతున్నాయి. కరోనా మొదటి దశలో బాగానే ఉన్నా రెండో దశలో మాత్రం అప్రదిష్ట మూటగట్టుకుంది. బీజేపీ ప్రభుత్వం ప్రజల బాధలు తీర్చడంలో విఫలమైందని అందరిలో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఈసారి ఇక్కడ కూడా పార్టీ విజయతీరాలకు చేరడం గగనమే అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లో కూడా గెలుపు సాధించాలంటే ఏం వ్యూహాలు సాధించాలనేదానిపై పార్టీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.

దీంతో ఈ రెండు స్టేట్ల పరిస్థితిపై పార్టీ సందిగ్దంలో పడిపోయింది. ప్రధానమంత్రి సొంత రాష్ర్టమైన గుజరాత్ లో పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు. వరుసగా మూడో సారి కూడా అధికారం చేపట్టి తామేమిటో నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలంటే ఏం వ్యూహాలు అమలు చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. కానీ పార్టీ ప్రతిష్ట నిలుపుకునేందుకు పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్ లను చేజిక్కించుకోవాలని తాపత్రయ పడుతున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular