
Sai Dharma Tej: వర్ధమాన సినీనటుడు సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మితిమీరిన వేగంతోనే ఆయన ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. స్పోర్ట్స్ బైక్ పై ఉన్న మక్కువతోనే యువత వాటిని సొంతం చేసుకుంటున్నారు. వాటిపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సాయిధరమ్ తేజ్ కు జరిగిన ప్రమాదం సమయంలో చుట్టుపక్కల వాహనాలు లేకపోవడంతోనే ఎలాంటి దుర్ఘటన జరగలేదు. స్పోర్ట్స్ బైక్ లను సవారీగా ఉపయోగిస్తూ ఎందుకు ప్రమాదాల బారిన పడుతున్నారో అర్థం కావడం లేదు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ వైద్యానికి బాగానే సహకరిస్తున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు, పరిశ్రమ వర్గాలు, బంధువులు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. సాయిధరమ్ తేజ్ నడిపిన బైక్ ఆయన పేరు మీద లేదు. అనిల్ కుమార్ బురా అనే వ్యక్తి పేరు మీద రిజిష్టర్ అయి ఉంది. అయితే సాయి తేజ్ ఆ బైక్ ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నా నిజమెంతో తెలియాల్సి ఉంది.
కాగా ఆ బైక్ పై అతివేగానికి సంబంధించిన ఓ చలానా పెండింగులో ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే దాన్ని క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఓ ఎన్టీఆర్ అభిమాని దీన్ని క్లియర్ చేశాడని తెలిసింది. మెగా హీరో బైక్ పెండింగ్ చలాన్ ను నందమూరి అభిమాని క్లియర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. నందమూరి-మెగా ఫ్యాన్స్ చెలిమికి ఇది నిదర్శనం అని అంటున్నారు. ఇక ఈ బైక్ ను సెకండ్ హ్యాండ్ లో సాయిధరమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం అతడి పేరు మీదే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు..
గతంలో రోడ్డు ప్రమాదంలోనే కోట శ్రీనివాస రావు కుమారుడు సైతం ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. రవితేజ తమ్ముడు కూడా ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు విధితమే. ఈ నేపథ్యంలో బైక్ రైడింగ్ పై యువత అంత శ్రద్ధ పెట్టకపోవడమే మంచిదనే అభిప్రాయం అందరిలో వస్తోంది. ఎందుకంత పిచ్చి బైకులంటే అని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.